
Ram Charanతో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నా:NTR ..ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే
NTR Jr – RRR Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటెడ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటెడ్ మూవీ RRR. ఇటు మెగాభిమానులు, అటు నందమూరి అభిమానులే కాదు.. ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న గ్రాండ్ లెవల్లో విడుదలవుతుంది. చిత్ర యూనిట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో ఎంతో బిజీగా ఉంది. అందులో భాగంగా సోమవారం RRR Pre Release Event చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తారక్ మాట్లాడుతూ ‘‘RRR విషయంలో నేను చాలా మందికి థాంక్స్ చెప్పుకోవాలి. అందులో ముందుగా మా జక్కన్నకు ధన్యవాదాలు. నాపై నమ్మకంతో ఇంత మంచి సినిమాలో నన్ను ఆయన భాగం చేశారు.
సినిమా పరంగా మన దగ్గర ఉన్న ప్రాంతీయ సినిమా అనే సరిహద్దులను ఆయన చెరిపేస్తున్నారు. పాన్ ఇండియా సినిమా అనే భావనను తీసుకొస్తున్నారు. అంతే కాదు.. ఈ సినిమాతో తెలుగు సినిమాలో ఉన్న ఇద్దరు స్టార్స్ కలిసి నటించే అందమైన అనుభూతిని మళ్లీ వెండితెరపై చూపించబోతున్నారు. అలాంటి సినిమా చూసి చాలా రోజులు అవుతుంది. కమల్ సార్.. రజినీ సార్ కలిసి సినిమా చేస్తే ఆ ఎగ్జయిట్‌మెంట్ ఎలా ఉంటుంది. అప్పట్లో బాలచందర్‌గారు అలాంటి సినిమా చేస్తే.. ఇప్పుడు రాజమౌళిగారు అలాంటి సినిమా చేశారు. అందరూ RRR సినిమా దయచేసి థియేటర్స్‌లోనే చూడండి. నా బ్రదర్ చరణ్‌తో RRRలోని ప్రతి షాట్‌ను మళ్లీ చేయాలనుకుంటున్నాను. అందుకు కారణం అతనితో నేను సమయం గడిపే అవకాశం దక్కుతుంది. ఇది ప్రారంభం మాత్రమే ముగింపు కాదు’’ అన్నారు.
RRR సినిమాను దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించారు. సినిమా అనౌన్స్‌మెంట్‌ను అందరిలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఆటోమెటిక్‌గా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలను ముందుగానే అంచనా వేసిన రాజమౌళి పాన్ ఇండియా రేంజ్ యాక్టర్స్‌తో RRR సినిమాను రూపొందించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలుసుకుని ఉండుంటే, వారి ఆలోచనలు, స్నేహం అన్నీ పరస్పరం మార్చుకుని చేసిన భావోద్వేగ ప్రయాణంలో ఇరువురు బ్రిటీష్‌వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందనేదే RRR సినిమా.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్