నోటా‌ మూవీ రివ్యూ

Nota movie review

టైటిల్ : నోటా
జానర్ : పొలిటికల్‌ డ్రామా
తారాగణం : విజయ్‌ దేవరకొండ, సత్యరాజ్‌, నాజర్‌, మెహరీన్‌
సంగీతం : సామ్‌ సీయస్‌
దర్శకత్వం : ఆనంద్‌ శంకర్‌
నిర్మాత : జ్ఞానవేల్‌ రాజా

!!ఇంట్రో!!
త‌మిళ‌నాడులో స‌డెన్ స్టార్స్ అయిన వారిని చాలా మందిని చూశాము.. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లోకూడా స‌డన్ స్టార్ అయ్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. ఇక అందుకే స‌డెన్ అనేది కాదు సెన్సేష‌న‌ల్ స్టార్ అనిపించుకున్నాడు. అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు, గీత‌గోవిందం ఇలా త‌న‌బ్రాండ్ ని సినిమాల‌పై వేశాడు. త‌ను సినిమాలో ఉంటేనే చాలు హైప్ అనేది వ‌స్తోంది. ఇప్ప‌డు స‌రికొత్త జాన‌ర్ సినిమాలో న‌టించాడు అదే నోటా, ఒక్క‌సారిగా రాజ‌కీయ చిత్రానికి వెళ్లిన విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రి ఈ సినిమాలో ఎటా న‌టించాడు అనేది తెలుసుకుందాం.. ఇక ఈ సినిమా కూడా త‌మిళ‌నాట కూడా రిలీజ్ అవుతోంది. ఇది కోలీవుడ్ పై కూడా ప్ర‌భావం చూపుతుంది. మ‌రి ఇంతలా సినిమాపై హోప్స్ పెట్టుకున్న విజ‌య్ కు ఎలాంటి పేరు వ‌చ్చిందో , ఈసినిమా ఎలా ఉందో చూద్దాం.

!!కథ !!
వరుణ్ !!విజయ్‌ దేవరకొండ!! ముఖ్యమంత్రి వాసుదేవ్ !!నాజర్‌!! కొడుకు… రాజకీయాలంటే గిట్టని వరుణ్‌ లండన్‌లో వీడియో గేమ్‌ డిజైనర్‌ గా పనిచేస్తుంటాడు. ఇండియాలోని కొన్ని అనాథాశ్రమాలకు మహేంద్ర సత్యరాజ్‌ సహకారంతో సాయం చేస్తుంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేసే వరుణ్‌ అనుకోకుండా సీఎం కుర్చీలో కూర్చోవాల్సి వస్తుంది. తండ్రి వాసుదేవ్‌ ఓ కేసు విషయంలో విచారణ ఎదుర్కోవాల్సి రావటంతో రాజకీయాలతో సంబంధంలేని వరుణ్‌ ని అధికార పీఠం మీద కూర్చోపెట్టి వెనకుండి అంతా నడిపించాలని భావిస్తాడు వాసుదేవ్‌. కానీ ఆ కేసులో వాసుదేవ్‌కు శిక్షపడటం, బెయిల్‌పై తిరిగి వస్తుండగా వాసుదేవ్‌ మీద హత్యా ప్రయత్నం జరగటంతో వరుణ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

తండ్రి మీద జరిగినట్టుగానే తన మీద ఇతర కుటుంబ సభ్యుల మీద దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. దీని వెనుక వేల కోట్లకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని ఇంటిలిజెన్స్‌ వర్గాలు చెపుతాయి.. అదే సమయంలో కోలుకున్న వాసుదేవ్‌.. వరుణ్ అధికారంలో ఉండేందుకు తనను మోసం చేస్తున్నాడని భావించి పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వరుణ్ ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు.? మాజీ ముఖ్యమంత్రి వాసుదేవ్‌ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు.? చివరకు వరుణ్ రాజకీయ నాయకుడిగానే కొనసాగాడా.. లేదా? అన్నదే మిగతా కథ

!!విశ్లేష‌ణ‌!!
ఇక సినిమాలో న‌ట‌న‌కు 100 కి 100 మార్కులు విజ‌య్ న‌ట‌న‌కు ప‌డ్డాయి అనే చెప్పాలి. ఇప్ప‌టికే డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్లతో సినిమాలు చేస్తున్న విజ‌య్, ఈ సినిమాలో కూడా త‌న స‌త్తా చాటారు. త‌న డైలాగ్ డెలివ‌రీతో అద‌ర‌గొట్టాడు. ఇక అత‌ని డైలాగ్స్ ఆటిట్యూడ్ సినిమాలో మ‌రింత ప్ల‌స్ అయ్యాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో డిఫ‌రెంట్ లుక్స్ తో క‌నిపించాడు. స‌త్యారాజ్ ఈసినిమాలో విజ‌య్ కు సాయం చేసే పాత్ర‌లో అల‌రించాడు పూర్తి న్యాయం చేశాడు. ఇక పూర్తి పొలిటిక‌ల్ గ్రాఫ్ ఉన్న సినిమాగా ఇది క‌నిపిస్తుంది. ఇక పార్టీ త‌ర‌పున నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్ర నాజ‌ర్ చేయ‌డం ఈ సినిమాకు ప్ర‌ధాన బలంగా మారింది. హీరోయిన్ మెహరీన్‌ది దాదాపు అతిధి పాత్రే. ఇతర పాత్రల్లో సంచన నటరాజన్‌, ప్రియదర్శి, ఎంఎస్‌ భాస్కర్‌ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

ఇక త‌నపై ద‌ర్శ‌కుడు పెట్టుకున్న న‌మ్మ‌కాన్నినిల‌బెట్టుకున్నాడు విజ‌య్, అలాగే దానికి నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. హీరోను ప్లేబాయ్‌ల పరిచయం చేస్తూ సినిమాలు మొదలు పెట్టిన దర్శకుడు ఆనంద్‌ శంకర్‌.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథ ప్రారంభించాడు. వెంటనే వరుణ్ పాత్ర సీఎం కావటం తరువాత రాజకీయ పరిణామాలతో ఫస్ట్‌ హాఫ్‌ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. విజయ్ నటన, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఇలా ఫస్ట్‌ హాఫ్ సూపర్బ్ అనిపిస్తుంది‌. కాని ముందు సినిమా అంతా బాగున్నా సెకండాఫ్ పై కాస్త ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు అని అనిపిస్తుంది. త‌మిళ నేటివిటి క‌నిపించింది కాని ఏపీ నేటివిటిని కూడా క‌నెక్ట్ చేసి ఉంటే రాజ‌కీయంగా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇక సామ్ సియ‌స్ మ్యూజిక్ బ‌లం కూడా ప‌నిచేసింది, ,నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. మ‌రో హిట్ విజ‌య్ ఖాతాల ప‌డింది అనే చెప్పాలి నోటాతో.

!!ప్లస్‌ పాయింట్స్‌!!
విజయ్‌ దేవరకొండ నటన
నేపథ్య సంగీతం
డైలాగ్స్‌
ద‌ర్శ‌క‌త్వం
నిర్మాణ విలువ‌లు

!!మైనస్‌ పాయింట్స్‌!!
క్లైమాక్స్‌
సెకండాఫ్ పై ఇంకాస్త శ్ర‌ద్ద పెట్టాలి

!!బాట‌మ్ లైన్ !!నోటా ఎన్నిక‌ల్లో కాని సినిమాల్లో కాదు అనేలా ఉంది.

రేటింగ్ 2.75

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.