వాట్ నెక్స్ట్ ఆదినారాయణ రెడ్డికి కొత్త టెన్షన్

New tension on Aadinarayana Reddy

మొత్తానికి జగన్ చెప్పినటు వంటి అన్నీ హామీలు తూచా తప్పకుండా ఫాలో అయి పాటించింది తెలుగుదేశం పార్టీ, ఈ నేతలకు ఆస్కార్ ఇవ్వాలి అని అంటున్నారు వైసీపీ నేతలు.. ముఖ్యంగా జగన్ రెండు వేలు పించన్ అనేసరికి వెంటనే పెంచేశారు.. 56 నెలలు తెలుగుదేశం పార్టీ ఈ పించన్ల పెంపు ఆలోచించలేదు, కొత్తగా ఇప్పుడు పెంచింది. ఇవన్నీ జనాలకు తెలియకుండా ఓట్లువేస్తారా అంటే, కచ్చితంగా తెలుసు అంటున్నారు మేధావి వర్గం.. ఇక గ్రాఫిక్స్ యాడ్స్ తో రాయలసీమకు నీళ్లు ఇచ్చాం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం నేతలకు, అక్కడ సీమలో కూడా నేతలు నిలదీస్తున్నారు. టీవీల్లో మా ఊళ్లు నీటితో కనిపిస్తున్నాయి, వాస్తవంగా చూస్తే నీటి చుక్కలేదు అంటున్నారు అక్కడ జనం.

సీఎం చంద్రబాబు వద్ద ఎప్పుడూ సలహాలు ఇవ్వడానికి కొందరు సీనియర్లు ఉంటారు. అందులో ఓ నేతగా జమ్మలమడుగు నుంచి పార్టీ ఫిరాయించి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి అయిన ఆదినారాయణ రెడ్డి ఒకరు.. ఇక రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా సరే, ఆయన జమ్మలమడుగు నుంచి పోటి చేస్తాను అని ఈసారి ఆదినారాయణ రెడ్డికి టికెట్ రాకుండా చేసి జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు.

ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా నిలబడ్డారు. ఇక కడప పొలిటికల్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే వన్ సైడ్ వైసీపీ అని తేలిపోయింది. ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే వాట్ నెక్ట్స్ అనే ఆలోచన ఇప్పటికే వచ్చేసిందట ఆదినారాయణ రెడ్డికి.. ఇప్పుడు ఇదే జమ్మలమడుగులో చర్చించుకుంటున్నారు. పులివెందుల తర్వాత అత్యధిక మెజార్టీ జమ్మలమడుగులో వస్తుంది అని చెబుతున్నారు అక్కడ నేతలు. ఇక్కడ వైసీపీ తరపున నిలబడిన సుధీర్ రెడ్డి గెలుపు పక్కా అని చెబుతున్నారు వైయస్సార్ పార్టీనేతలు. ఆదినారాయణరెడ్డి కూడా దారుణమైన ఓటమిపాలు అవుతున్నారు అని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఎంపీగా కడప నుంచి మరోసారి అవినాష్ రెడ్డి గెలుపు పక్కా అని అంటున్నారు. మొత్తానికి ఆదినారాయణ రెడ్డి రాజకీయాలకు ఎండ్ కార్డ్ వేసుకున్నట్లే అని చెబుతున్నారు అక్కడ నేతలు, అంతేకాదు రామసుబ్బారెడ్డి రాజకీయ భవితవ్యం కూడా ఇప్పుడు డైలమాలో పడింది అని గుసగుసలాడుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ జెండా ఎగురడం ఖాయం అని అలాగే, జగన్ ని పులివెందులలో సైతం ఓడిస్తా అని ప్రగల్బాలు పలికిన మంత్రి వర్యులు ఆదినారాయణ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు… మరి వాట్ నెక్స్ట్ అనే ప్రచారం కూడా జమ్మలమడుగు నుంచి ఏపీ అంతా మంత్రి ఆదినారాయణ రెడ్డి విషయంలో జరుగుతోందట.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.