టిక్ టాక్ మోజుతో ప్రియుడితో జంప్ అయిన కొత్త పెళ్లి కూతురు

New bridal daughter who jumps out with boyfriend with tick talk fanatic

ఈమధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ టిక్ టాక్. సినిమాల్లోని పాటలు, వీడియోలతో 15 సెకండ్ల బిట్ తో మీరు కూడా పాప్ స్టార్లు యాక్టర్లు అయిపోయేలా ఈ యాప్ చేస్తోంది. అయితే అంతే నష్టం కూడా చేస్తోంది.
తాజాగా తమిళనాడులో టిక్ టాక్ మోజులో పడి భర్తను వదిలేసింది భార్య.

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి సమీపంలోని దేవరకోట గ్రామానికి చెందిన ఆరోగ్య లోయ అనే వ్యక్తికి లలిత అనే అమ్మాయితో ఒకనెల క్రితం వివాహమైంది. ఈసరదా వారికి కేవలం నెలరోజులు మాత్రమే ఉంది, భార్య అంటే ఎంతో ఇష్టం చూపించిన ఆమె తనకు టిక్ టాక్ అంటే కూడా ఇష్టం అని చెప్పింది, అయితే సినిమాలపై తన భార్యకు సరదా కాబట్టి ఆ వీడియోలు రోజుకి ఎన్ని పెట్టినా భర్త ఏమీ అనలేదు,

ఉద్యోగరీత్యా పెళ్ళయిన తరువాత సింగపూర్ వెళ్ళాడు భర్త. అయితే ఇంట్లో ఒక్కటే ఉండడంతో కాలక్షేపంగా టిక్ టాక్ ను మరింత వాడేసింది లలిత, క్రమంగా దానికి బానిసగా మారిపోయింది. రోజంతా టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేది. ఈ క్రమంలో తన వీడియోలకు కామెంట్లు పెట్టే అభి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది.

తరచూ అతనితో చాటింగ్ చేయడం ప్రారంభించింది. సింగపూర్ నుంచి ఇంటికి వచ్చిన భర్త టిక్ టాక్ మానమని భార్య లలితను మందలించాడు. దీంతో భర్త మీద కోపం పెంచుకున్న లలిత ఇంట్లోని 60 సవర్ల బంగారం, నగదుతో ప్రియుడితో కలిసి పరారైంది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఆమె మాత్రం కేవలం నెల రోజుల క్రితమే అతనితో టిక్ టాక్ ద్వారా పరిచయం పెంచుకుంది.. చివరకు అతనితో కలిసి పారిపోయింది. అత్తమామలు ఇలాంటి వీడియోలు చేయవద్దు అని చెప్పినా ఆమె వినలేదు, సరదాకి చేస్తోంది అని భర్త అనుకుంటే చివరకు వివాహ బంధాన్ని తెంచుకుని ప్రియుడితో పారిపోయింది అతని భార్య, అయితే అతను మాత్రం తనకు ఈ భార్య వద్దు అని ఇలా ఎవరు నచ్చితే వారితో వెళ్లిపోతే నేను తనని వెతకడానికే నా సమయం కేటాయించాలని, తనకు విడాకులు ఇచ్చెయ్యాలని కోర్టుని కోరతాడట. మొత్తానికి నెల రోజులకే వీరి కాపురం ఇలా అవ్వడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చివరకు టిక్ టాక్ కుటుంబాలలో ఇలా చిచ్చుపెడుతోంది.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.