
‘అఖండ’లో జై బాలయ్య సాంగ్‌కి రవితేజ స్టెప్పులు.. వీడియో వైరల్: Ravi Teja
Akhan Jai Balaiah Song : అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్‌కు బాలకృష్ణ వేసిన స్టెప్స్‌కు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు అదే పాటకు హీరో రవితేజ స్టెప్పేస్తే ఎలా ఉంటుంది. అది తెలియాలంటే బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో చూడాల్సిందే. ఈ షో లో రవితేజ, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాని ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అఖండ’. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశారు. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు పాటలకు మంచి స్పందన వచ్చింది. అందులో జై బాలయ్య అంటూ సాగే పాటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాటకు బాలకృష్ణ వేసిన స్టెప్స్‌కు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు అదే స్టెప్పు హీరో రవితేజ చేస్తే ఎలా ఉంటుంది.. చూడటానికి చాలా బాగుంటుందిగా. అయితే ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో చూడాల్సిందే.
రీసెంట్‌గా నందమూరి బాలకృష్ణ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో అన్‌స్టాపబుల్ అనే టాక్‌షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకు, ముఖ్యంగా దాన్ని బాలయ్య హోస్ట్ చేస్తున్న తీరుకి చాలా మంచి స్పందన వస్తుంది. ఈ షోలో హీరో రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని అతిథులుగా పాల్గొంటే బాలకృష్ణ వారిని ప్రశ్నలు వేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందులో మ్యూజిక్ రెడీ అని బాలకృష్ణ అనగానే, దానికి రవితేజ వేయండి ట్రై చేద్దాం అని అంటారు. దానికి బాలయ్య రియాక్ట్ అవుతూ యా అది స్పిరిట్ అంటే అన్నారు. అప్పుడు సాంగ్ రాగానే రవితేజ జై బాలయ్య పాటకు స్టెప్పులేశారు. రవితేజ డాన్స్ చూసిన బాలయ్య తనను అప్రిషియేట్ చేశారు.
నిజానికి ఈ ఎపిసోడ్ డిసెంబర్ 24న క్రిస్మస్ సందర్భంగానే రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో ప్రసారం కాలేదు. దీంతో నిర్వాహకులు ఇదే ఎపిసోడ్‌ను డిసెంబర్ 31న ప్రసారం చేస్తున్నారు. మరి పూర్తి ఎపిసోడ్‌లో బాలకృష్ణ, రవితేజ మధ్య ఎలాంటి ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటాయనేది చూడాలి మరి. బాలకృష్ణ తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి వేటపాలెం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్