
చిరంజీవితో నటించేందుకు నయనతార డిమాండ్.. హాట్ టాపిక్‌గా మారిన రెమ్మ్యూనరేషన్
‘సైరా నరసింహా రెడ్డి’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో మరోసారి తెరపంచుకోనుంది సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార. పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’లో ఆమెను కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. ఈ మేరకు రీసెంట్‌గా అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా నయనతార రెమ్మ్యూనరేషన్ గురించిన ఓ సమాచారం వైరల్ అవుతోంది.
మలయాళంలో సూపర్‌హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం చిరంజీవి సహా భారీ తారాగణం ఎంచుకున్నారు. అయితే ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉండే హీరో సోదరి పాత్ర కోసం నయన్‌ని తీసుకోగా.. ఈ రోల్ చేయడానికి ఆమె భారీగా డిమాండ్ చేసిందట. ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా ఓకే చెప్పేశారట. సినిమాలో ఈ రోల్ ఎంతో కీలకంగా ఉండనుందని, అందుకే ఆమె ఎంత డిమాండ్ చేసినా ఓకే చెప్పారని టాక్.
కొణిదెల ప్రొడెక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. నయనతార భర్తగా ఆయన నటిస్తున్నారని సమాచారం. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కూడా ఇందులో భాగం కాబోతున్నారని అంటున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు కడుతుండగా.. నీరవ్ షా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్