జెట్ స్పీడులో దూసుకుపోతున్న నాదెండ్ల మనోహర్

Nandendla Manohar is going to jet speed in Janasena party

ఆయన కాంగ్రెస్ లో ఉండగా స్పీకర్ గా పనిచేశారు… ఆ సమయంలో ఎంత పేరు వచ్చిందో కాని ,ఇప్పుడు పవన్ కల్యాణ్ పక్కన పొలిటికల్ గా ఉండటంతో ఆయనకు మరింత క్రేజ్ అయితే వచ్చింది.. అమితంగా పవన్ కల్యాణ్ అభిమానులు జనసేనలో ఆయనకి పవన్ కల్యాణ్ తర్వాత స్ధానం ఇస్తున్నారు. ఆయనే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ . ఇక జనసేన నుంచి పార్టీ తరపున పార్ట కార్యక్రమాలు కూడా చాలా బాగా ముందుకు తీసుకువెళుతున్నారు.

ఇక గుంటూరు జిల్లాలో రాజకీయాలు జనసేన తరపున నాదెండ్ల చూసుకుంటున్నారు.. ఏపీలో ఈ మూడు నెల్లలో ఎన్నికల హీట్ బాగా కనిపించనుంది.ఈ సమయంలో పవన్ ఇటీవల గుంటూరు జిల్లాలో తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారు అని తెలియచేశారు.. ఇక ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకంటే , ప్రతిపక్ష పార్టీ వైసీపీ కంటే మనోహర్ కు మంచి పేరు వస్తోంది. సీనియర్ అవ్వడం అలాగే ఇక్కడ తండ్రి నుంచి రాజకీయాల్లోకి వచ్చినా తక్కువ సమయంలోనే స్పీకర్ అవ్వడం రెండు సార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలవడంతో ఆయనకు మంచి ఫేమ్ వచ్చింది.

అంతేకాదు రాజకీయంగా నాదెండ్ల మనోహర్ కు చాలా విషయాలు తెలసు, అసెంబ్లీని నడిపిన విధానంలో ఆయనకు ప్రశంసలు ఇచ్చారు నేతలు… సో నాదెండ్ల నుంచి అనేక సలహాలు కూడా తీసుకున్నారు పవన్ కల్యాణ్ …మొత్తానికి తెనాలి నుంచి ఈసారి ఆయన ప్రచారం చూస్తుంటే భారీ మెజార్టీతో జనసేనని గెలిపిస్తారు అని అంటున్నారు అభిమానులు పార్టీ కేడర్. అలాగే ఇక్కడ పార్టీ తరపున సర్వేలో కూడా నాదెండ్ల ముందు వరుసలో ఉన్నారట.. ఇది వైసీపీకి తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపించనుంది అంటున్నారు జనసేన కేడర్.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.