‘నక్షత్రం’ మూవీ రివ్యూ & రేటింగ్

మూవీ ‌‌: నక్షత్రం 
నటీనటులు :  సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్ 
సంగీతం    ‌: మణిశర్మ, భీమ్స్ 
ధర్మకత్వం : కృష్ణవంశీ
నిర్మాత : కె. శ్రీనివాసులు, ఎస్, వేణుగోపాల్, సజ్జు.
 
 
కెరీర్ లో సంక్షోభ దశను ఎదుర్కొంటున్న ఇద్దరు హీరోలు, దర్శకుని కాంబినేషన్ లో వస్తున్న మూవీ నక్షత్రం.  క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ వంశీ ఇటీవలి కాలంలో తన స్థాయికి తగిన సినిమాలు తీయడంలో విఫలమవుతున్నాడు. మరోవైపు యాక్టర్ గా ప్రూవ్ చేసుకున్నా స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు సందీప్ కిషన్. మరోవైపు వరుస హిట్లతో రాకెట్ లా దూసుకెళ్లి తర్వాత వరుస ప్లాఫ్ లతో సతమతమవుతున్న హీరో సాయి ధరమ్ తేజ.  ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన నక్షత్రం మూవీ వీరి కెరీర్ లకు ఎంత వరకూ ఉపయోగపడిందన్న విషయం తెలుసుకోవాలంటే ఈ మూవీ రివ్యూ లోకి వెళ్లాల్సిందే. 
 
స్టోరీ‌: 
 
చిన్నతనం నుంచి పోలీసు కావాలని కలలు కంటూ ఉంటాడు రామారావు ( సందీప్ కిషన్) వాళ్ల తాతల నుంచి వాళ్ల కుటుంబం పోలీస్ ఫ్యామిలీ కావడంతో రామారావు కి పోలీసు కావాలని బలంగా ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులను ఎవరైనా ఒక్కమాట అన్నా సహించలేడు. ఓసారి పోలీసులను కొట్టాడన్న కారణంతో పోలీస్ కమీషనర్ కొడుకు రాహుల్ ( తనీష్) తో గొడవ పెట్టుకుంటాడు. రాహుల్ అతని స్నేహితులను కొడతాడు. దీంతో రామారావు పై పగ పెంచుకున్న రాహుల్ అతనికి ఉద్యోగం రాకుండా అడ్డుకుంటాడు. దీంతో ఒక దశలో సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్న రామారావు , సమాజం పట్ల బాధ్యత ఉంటే పోలీసు ఉద్యోగమే అవసరం లేదని, ఉద్యోగం లేకపోయినా పోలీసులా డ్యూటీ చేయాలని డిసైడ్ అవుతాడు.  పోలీస్ యూనిఫామ్ వేసిన క్రమంలో ఒక బాంబ్ బ్లాస్ట్  కేసులో ఇరుక్కుంటాడు. అతను వేసిన యూనిఫామ్ పై అలెగ్జాండర్ నేమ్ ప్లేట్ చూసి పోలీసులు వెతకడం మొదలుపెడతారు. అసలు ఇంతకీ అలెగ్జాండర్ ఎవరు? అలెగ్జాండర్ ఏమయ్యాడు? అసలు నిజంగా రామారావుకి పోలీసు ఉద్యోగం వస్తుందా? అన్నదే మిగిలిన కథ. 
 
నటీనటుల ఫెర్ఫార్మెన్స్ : 
 
చెప్పాలంటే ఇందులో నటించిన అందరికీ ఇది చాలా చాలా ముఖ్యమైన సినిమా.  అందుకేనేమో కానీ ఇందులో నటించిన ప్రతీ ఒక్కరూ సినిమా కోసం 100 శాతం కష్టపడ్డారు. మాస్ లుక్ ఉన్న ఒక సాధారణ కుర్రాడిగా సందీప్ కిషన్ ఇరగదీసాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ తన ప్రతిభను చూపెట్టుకున్నాడు. ఇక తొలిసారిగా విలన్ అవతారమెత్తిన యువ హీరో తనీష్ నెగెటివ్ రోల్ కు పర్‌ఫెక్ట్ గా నప్పాడు. కనిపించింది కాస్త తక్కువే అయినా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నమైతే చేసాడు. ఇక రెజీనా గ్లామర్ కు తప్పించి ఫెర్‌ఫార్మెన్స్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. మరో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ యాక్షన్, గ్లామర్ సీన్స్ లోనూ ఆకట్టుకుంది. మిగిలిన పాత్రల్లో ప్రకాష్ రాష్, శివాజీ రాజా, జేడీ, బ్రహ్మాజీలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. 
 
సాంకేతిక విభాగం : 
 
తన కెరీర్ కు ఇది చాలా ముఖ్యమైన సినిమా అయినప్పటికీ డైరెక్టర్ కృష్ణవంశీ ఎందుకో తడబడ్డాడు. తన ప్రీవియస్ మూవీల మాదిరి క్రైం, ప్రేమ, దేశభక్తి లాంటి చూపించాలనుకుని ఆ ప్రయత్నంలో విఫలమయ్యాడు. కొన్ని క్లారిటీ లేని క్యారెక్టరైజేషన్స్ సినిమాను వెనక్కు లాగాయి. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం కథనే చెప్పకుండా గ్లామర్ షో తో నడిపించేయడం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అసలు కథలోకి వెళ్లినా సినిమా మాత్రం వేగం పుంజుకోదు. కృష్ణవంశీ మార్కు సినిమాలు చూద్దామనుకుంటే ఈ మూవీతో నిరాశ తప్పదు. అయితే ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ సీన్లు మాత్రం ఆకట్టుకున్నాయి. మణిశర్మ, భీమ్స్ అందించిన పాటలు ఒకే. ముఖ్యంగా మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఆకట్టుకునేలా ఉంది. 
 
ప్లస్ పాయింట్స్  : 
 
సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన నటుల నటన 
ప్రధాన స్టోరీ
 
మైనస్ పాయింట్స్ : 
 
సినిమా ఫస్ట్ హాఫ్ 
చాలా సీన్స్ లో స్లోగా సాగే కథనం 

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.