
లాక్ డౌన్ తర్వాత మొదటిసారి ఈ రేంజ్లో..లవ్ స్టోరి సినిమాకు భారీ బుకింగ్స్
Love Story : కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లులో అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ మై షో లాంటి సైట్స్ చాలా డల్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ సెగ్మెంట్ లో కూడా ఊపొచ్చింది. లవ్ స్టోరీ (love story) సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. లవ్ స్టోరీ సినిమా అన్ని ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో వారం ముందే ఆన్ లైన్ బుకింగ్స్ తెరిచారు.
(Naga Chaitanya) (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ (love story)అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్స్‌లో విడుదలకానుంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై మరిన్ని అంచనాలు పెంచగా, మొన్న విడుదలైన ట్రైలర్‌కు కూడా భారీ స్పందన లభించింది. మంచి అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లో ఉన్న థియేటర్లలో మొదటి రోజు 245 షోలలో 85 షోలు బుకింగ్స్ అయిపోయాయి. మహేష్ బాబు AMB సినిమాస్‌లో కూడా ఇప్పటికే 6,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. దాదాపు 35 శాతం ఆక్యుపెన్సీతో ముందుగానే థియేటర్లు ఫుల్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అదిరేపోయే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 19న జరగనుంది. ఈ ఈవెంట్‌కు గెస్ట్స్‌గా చిరంజీవి, నాగార్జునలు వస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర ట్రైలర్ విడుదలైంది. తాజాగా విడుదల అయిన ట్రైలర్ కి నెటిజన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ ఇప్పటి వరకు 6 మిలియన్ ప్లస్ వ్యూస్‌తో అదరగొడుతోంది. లవ్ స్టోరీ ట్రైలర్ 24 గంటల్లో 342కే లైక్స్ ను సొంతం చేసుకుని టాప్ ఫైవ్ లైక్స్ వచ్చిన ట్రైలర్ లలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. వకీల్ సాబ్, బాహుబలి, సాహో, సరిలేరు నీకెవ్వరు సినిమాల తర్వాత లవ్ స్టోరీ ఎక్కువగా లైక్స్ పొందిన ట్రైలర్‌గా నిలిచింది. ఇక ఈ నెల 24న విడుదలకానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ప్రశంసిస్తూ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారట. లవ్ స్టోరీ 2 గంటల 25 నిమిషాలుగా ఉన్నట్టు తెలుస్తోంది.
Gallery
Latest Updates
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్
-
Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit
-
ప్రియురాలు ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడి స్టోరీ “విక్రమ్ సినిమా”
-
‘అఖండ’లో జై బాలయ్య సాంగ్‌కి రవితేజ స్టెప్పులు.. వీడియో వైరల్: Ravi Teja
-
అల్లు అర్జున్ నటనపై మెగాస్టార్ కామెంట్స్..సుకుమార్‌తో చిరంజీవి మీట్
-
Ram Charanతో మళ్లీ సినిమా చేయాలనుకుంటున్నా:NTR ..ఇది ముగింపు కాదు.. ప్రారంభం మాత్రమే
-
రాజమౌళి:Ram Charan తెల్ల కాగితం లాంటివాడు.. తారక్ గురించి అంతా తెలుసు
-
పూర్ణ ప్రధాన పాత్ర లో నటించిన “బ్యాక్ డోర్” సినిమా రివ్యూ
-
అవన్నీ తెలియదన్న డైరెక్టర్…Radhe Shyam విడుదలపై క్లారిటీ
-
Saamanyudu Teaser