
బంగార్రాజు సంక్రాంతి రేసులో ఉన్నట్లా.. లేనట్లా
Naga Chaitanya | Bangarraju : ఈ సినిమా విడుదల తేదీపై ఇంత వరకు క్లారిటీ లేదు. సంక్రాంతి విడుదల అని అంటున్నారు కానీ ప్రమోషన్స్‌లో వెనుకబడి ఉంది. దీంతో అసలు బంగార్రాజు సంక్రాంతికి వస్తుందా.. లేదా అనే క్లారిటీ లేక అక్కినేని ఫ్యాన్స్ కన్ఫూజన్‌లో ఉన్నారు.
Naga Chaitanya | Bangarraju : నాగ చైతన్య, నాగార్జునలు కలిసి బంగార్రాజుమూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌లో చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. తన తండ్రి (Nagarjuna) లెవల్లో నటించి ఔరా అనిపించారు. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య చేస్తున్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీపై ఇంత వరకు క్లారిటీ లేదు. సంక్రాంతి విడుదల అని అంటున్నారు కానీ ప్రమోషన్స్‌లో వెనుకబడి ఉంది. దీంతో అసలు బంగార్రాజు సంక్రాంతికి వస్తుందా.. లేదా అనే క్లారిటీ లేక అక్కినేని ఫ్యాన్స్ కన్ఫూజన్‌లో ఉన్నారు. ఇక సంక్రాంతికి వస్తామని ప్రకటించిన పలు సినిమాలు ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ వంటి ప్యాన్ ఇండియా సినిమాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం పోస్ట్ పోన్ కాగా Pawan Kalyan భీమ్లా నాయక్ ఫిబ్రవరికి వాయిదా పడింది.
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ జనవరి 7 వ తేదీన విడుదల కానుండగా.. ప్రభాస్ రాధే శ్యామ్ 14 వ తేదీన విడుదల కానుంది. ఇక ఇదే రేసులో ఉన్న అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బంగార్రాజు చిత్రం విడుదల పై ఇంకా క్లారిటీ లేదు.. సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం జనవరి 15 వ తేదీన విడుదల కావలసి ఉంది. దీనిపై టీమ్ త్వరలో ప్రకటించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి మరో సాంగ్ లిరికల్ విడుదలైంది. వాసివాడి తస్సాదియ్యా అంటూ సాగే ఈ పాట మాస్‌కు ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. నిన్న టీజర్‌ను విడుదల చేయగా.. పూర్తి పాటను డిసెంబర్ 19న విడుదల చేశారు. ఈ పాటను కళ్యాణ కృష్ణ కురసాల రాయగా.. మోహన బోగరాజు, సాహితి పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఆ మధ్య ‘నా కోసం’ అంటూ సాగే ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట మెలోడియస్‌గా సాగుతూ ఆకట్టుకుంటోంది. ఈ పాటను బాలాజీ రాయగా సిద్ శ్రీరామ్ పాడారు. బంగార్రాజు లో (Bangarraju) నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య (Naga Chaitanya) సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (Kriti shetty) నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్