నా నువ్వే రివ్యూ

Naa Nuvve Review

టైటిల్ : నా నువ్వే
జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : కల్యాణ్ రామ్‌, తమన్నా, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళీ, ప్రవీణ్‌
సంగీతం : శరత్‌
దర్శకత్వం : జయేంద్ర
నిర్మాత : మహేష్‌ ఎస్‌. కోనేరు, కిరణ్ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి
!!ఇంట్రో .!!.

నంద‌మూరి హీరోలు అంటేనే మాస్ ఫాలోయింగ్ ఉన్నహీరోలు.. అందులో క‌ల్యాణ్ రామ్ కూడా అలాగే ఇమేజ్ ను కంటిన్యూ చేస్తున్నాడు..
వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఎన్టీఆర్ ఫ్యామిలీలో నిల‌బ‌డ్డాడు..అయితే ఈసారి మాస్ లుక్ నుంచి క్లాస్ లుక్ కి వ‌చ్చి ఓ సినిమాతో అల‌రించాడు.
నా నువ్వేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కల్యాణ్ రామ్‌.. అస‌లు ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఎలా ఉంది అనేది ఓసారి చూద్దాం.

!!క‌థ‌!!

నా నువ్వే డెస్టినీని నమ్మే అమ్మాయి.. నమ్మని అబ్బాయిల ప్రేమకథ ఈ చిత్రం . వరుణ్ !!కల్యాణ్ రామ్‌!! పెద్దగా నమ్మకాలు లేని మోడ్రన్‌ కుర్రాడు. అమెరికాలో ఉద్యోగం రావటంతో ఫ్రెండ్స్‌ని, బామ్మని వదిలేసి అమెరికా ప్రయాణం అవుతాడు. కానీ ఏవేవో కారణాల వల్ల మూడు సార్లు వరుణ్ ప్రయాణం క్యాన్సిల్‌ అవుతుంది. మీరా !!తమన్నా!! డెస్టినీని విపరీతంగా నమ్మే అమ్మాయి. అనుకోకుండా తన దగ్గరకు వచ్చిన బుక్‌ లో వరుణ్‌ ఫొటో చూసి ఇంప్రెస్‌ అవుతుంది. ఆ ఫొటో చూసినప్పుడలా తనకు లక్‌ కలిసి వస్తుండటంతో ఫొటో చూసే వరుణ్‌తో ప్రేమలో పడుతుంది. ఎలాగైన వరుణ్‌కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. అనుకున్నట్టుగానే వరుణ్‌ కలిసి తన ప్రేమ గురించి చెపుతుంది. అయితే మీరా నమ్మే డెస్టినీకి ఓ టెస్ట్‌ పెట్టిన వరుణ్ చివరకు మీరాతో ప్రేమలో పడతాడు. మీరా తండ్రి !!తనికెళ్ల భరణి!! వారి ప్రేమకు అడ్డు చెప్తాడు. అనుకోని పరిస్థితుల్లో వరుణ్, మీరాకు దూరమవుతాడు. వరుణ్‌ను తిరిగి కలుసుకునేందుకు మీరా ఏం చేసింది..? వరుణ్, మీరాలు ఎందుకు దూరమయ్యారు..? చివరకు ఎలా కలిశారు..? అన్నదే మిగతా కథ వెండి తెర‌పై చూడాలి.
విశ్లేష‌ణ‌.
మాస్ లుక్ తో క‌నిపించిన క‌ల్యాణ్ రామ్ ఈ సినిమాలో క్లాస్ లుక్ తో మెరిశాడు. మీరా పాత్ర‌లో త‌మన్నా న‌ట‌న ఇర‌గ‌దీసింది అంటారు. ఇక సాఫ్ట్ లుక్ తో క‌ల్యాణ్ రామ్ త‌న‌న‌ట‌న‌ను పీక్స్ కు తీసుకువెళ్లాడు…పోసాని కృష్ణమురళీ తెర మీద కనిపించింది తక్కువ సేపే అయిన ఉన్నంతలో తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. హీరోయిన్‌ తండ్రి తనికెళ్ల భరణీ తనకు అలవాటైన రొటీన్ పాత్రలో కనిపించారు. ప్రవీణ్‌, వెన్నెల కిశోర్‌, సురేఖ వాణి, ప్రియదర్శి తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక లుక్స్ గ్లామ‌రస్ పాత్ర‌లో త‌మ‌న్నా అల‌రించింది.ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర క‌థ‌పై పెట్టిన శ్ర‌ద్ద ఇంకా ఉండాలేమో అని అనిపిస్తుంది..ఇక్కడ విడిపోయిన వీరిద్ద‌రూ ఎలా క‌లిశారు అనేదానిపై స‌స్పెన్స్ తో సినిమాని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర‌.మంచిక‌మెడియ‌న్స్ ఉన్నా వారిని ఉప‌యోగించుకోలేక‌పోయారు అని తెలిసిపోయింది.. పీసీ శ్రీరాం లాంటి లెజెండరీ సినిమాటోగ్రాఫర్‌ ఉన్నా.. ఆయన మ్యాజిక్‌ కూడా ఎక్కడా కనిపించలేదు..అంచ‌నాల‌ను అందుకుందా అంటే మొత్తం అందుకోలేదు అని చెప్ప‌వ‌చ్చు ఈ చిత్రంలో

ప్లస్‌ పాయింట్స్‌ :
తమన్నా గ్లామర్‌
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ

మైనస్‌ పాయింట్స్‌ :
స్లో నేరేషన్‌
లవ్‌ స్టోరిలో ఉండాల్సిన అంత ఫీల్ తెర‌పై ఆవిష్క‌ర‌ణ లేదు
ఎంటర్‌టైన్మెంట్‌ లేకపోవటం

రేటింగ్ 2.5

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.