Mr. మజ్ను మూవీ రివ్యూ

Mr Majnu Review, Mr Majnu movie Review, Mr Majnu telugu movie Review

నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
తారాగణం: అఖిల్ అక్కినేని, నిధిఅగర్వాల్, జయప్రకాశ్, రావు రమేష్, నాగబాబు, విద్యుల్లేఖారామన్, ప్రియదర్శి, హైపర్ అది, అజయ్, సుబ్బరాజు తదితరులు
సంగీతం: ఎస్.ఎస్.తమన్
ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్
కూర్పు: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్ల
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి

!!ఇంట్రో !!

అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు, నాగ్ కూడా అఖిల్ సినిమాల కధల పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇప్పటి వరకూ వచ్చిన చిత్రాల్లో అఖిల్ కు హలో సినిమా మంచి విజయాన్ని అందించింది. తొలిప్రేమ చిత్రంతో విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో కలిశాడు అఖిల్.. ఇక లవ్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో అక్కినేని కుటుంబానికి పేరు ఉంది ..అందుకే ఇప్పుడు కూడా ఇలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ..మరి మిస్టర్ మజ్ను ఎలా ఉంది అనేది చూద్దాం.

!!కథ!!
విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ అలియాస్ కృష్ణ !!అఖిల్!! యుఎస్లో ఎం.ఎస్.చదువుతుంటాడు. అతన్ని చూడగానే ప్రతి అమ్మాయి ఇష్టపడుతుంది. వాళ్లు అతని జీవితంలోకి వచ్చినా, వెళ్లినా అతనికి పెద్ద పట్టింపు ఉండదు. తనకు రాముడిలాంటి భర్త రావాలనుకుంటుంది నిక్కి !!నిధి!!…. ఆమెకు ఈ సమయంలో విక్కీ తో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ ఒకేసారి ఇండియాకు వస్తారు. కాబోయే చుట్టాలని వాళ్లకి ఎయిర్పోర్టులోనే తెలుస్తుంది. నిక్కి అన్న !!రాజా!! కు, విక్కీ చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. అలా విక్కీ, నిక్కీ బంధువులవుతారు. నిక్కీకి ఆడపడుచు లాంఛనాలు పెట్టడానికి విక్కీ తండ్రి కొంచెం డబ్బులిచ్చి విక్కీని దగ్గరుండి చూసుకోమంటాడు.

అలా విక్కీ, నిక్కీ మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అతనంటే ఆమెకు ఇష్టం కలుగుతుంది. రెండు నెలల్లో అది ప్రేమగా మారుతుందేమోనని టెస్ట్ చేయడం మొదలుపెడతారు. వారి పరిచయం ప్రేమగా మారిందా? ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్లిందా? వెళ్లకపోతే వారి ప్రేమకు వచ్చిన అవాంతరాలేంటి? వాటికి విక్కీ కారణమా? నిక్కీ కారణమా వంటి అంశాలు అన్ని తెలియాలి అంటే వెండితెరపై చూడాల్సిందే.

!!విశ్లేషణ!!
ఇక లవ్ సినిమాలకు నటనలో కేరాఫ్ అడ్రస్ అక్కినేని ఫ్యామిలీ.. వారికి నటన ఆ పాత్రలోకి రాగానే వచ్చేస్తుంది అంతే… మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి భర్తగా రావాలి అని ఆమె కోరుకుంటుంది.. ఇలాంటి లక్షణాల గురించి నిక్కి చెప్పే డైలాగులు అందరిని ఆకట్టుకుంటాయి.
అతని మీద అతి ప్రేమను చూపిస్తుంది. అప్పటివరకు అలాంటి ప్రేమను ఆస్వాదించని విక్కీకి అది అతిగా అనిపిస్తుంది. ఆ ఉక్కిరిబిక్కిరి పరిస్థితి నుంచి బయటకు రావాలనుకుంటాడు. అయితే ఆ విషయాన్ని అమ్మాయితో కాకుండా, తన ఫ్రెండ్తో చెబుతాడు. చాటుగా వింటుంది నిక్కి. ఆత్మాభిమానం ఉన్న ఆమె విక్కీ నుంచి దూరం జరుగుతుంది. ఆమె దూరమైన తర్వాత గానీ అతనికి ఆమె తనపై చూపించిన నిజమైన ప్రేమ అర్థం కాదు. అక్కడి నుంచి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు.ఇలా కొత్తధనం చూపించాడు దర్శకుడు. కాస్త తొలిప్రేమ సన్నివేశాలు అక్కడక్కడా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. అఖిల్ అటు డ్యాన్సుల్లోనూ, ఇటు ఫైట్లలోనూ, కొన్ని డైలాగులు చెప్పడంలోనూ ఎక్సలెంట్ అనిపించాడు. సితార ప్రీ క్లైమాక్స్ లో చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి. ఇక సినిమాలో లాజిక్కులు పట్టించుకోకూడదు, ఇలా చిన్నదానికి కోపాలు పడేవారు రిలేషన్స్ పొగొట్టుకునేవారికి సినిమా కాస్త ఎఫెక్ట్ చూపిస్తుంది.. వారి మదిలో ఆలోచనలు కలిగిస్తుంది.. మొత్తానికి అందరికి నచ్చే కథ.. కాని లాజిక్కులు లేకుండా చూడాలి. అఖిల్ కు మరో సక్సెస్ తన ఖాతాలో పడింది అని చెప్పాలి మిస్టర్ మజ్నుతో.

!!ప్లస్ పాయింట్స్!!
అఖిల్ నటన
అందమైన ఫ్యామిలీ ఎమోషన్స్
రిలేషన్ కోసం డైలాగులు
పాటలు
నేపథ్య సంగీతం

!!మైనస్ పాయింట్స్!!
రొటీన్ కథ
ఈజీగా తేలిపోయిన లాజిక్స్

!!బాటమ్ లైన్ !! రొటీన్ మజ్ను

!!రేటింగ్!! 3

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.