మోదీ దెబ్బ మామూలుగా లేదుగా!

జాతీయ స్థాయిలో ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు అబ్బురపరుస్తున్నాయి. 2014 సాధారణ ఎన్నికలు మొదలుకొని మొన్నటి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వరకూ మోదీ అండ్ కో ప్లాన్స్ కు ప్రతిపక్షాలు చిత్తయిపోతున్నాయి. తాజాగా రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటన విషయంలోనూ బీజేపీ రాజకీయ చతురతను ప్రదర్శించింది. రాష్ట్రపతి అభ్యర్ధిగా దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్రకటించి ప్రతిపక్షాలను ఇరుకున పెట్టింది. 
 
మన దేశంలో దళిత ఓటర్ల సంఖ్య దాదాపు 17 శాతం. ఏ రాజకీయ పార్టీలైనా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దళిత ఓటర్లను ఆకట్టుకోవాల్సిందే. ఇప్పుడు బీజేపీ ప్రతిపాదించిన రామ్‌నాథ్ కోవింద్ కు మద్ధతు ఇవ్వకుంటే ప్రతిపక్షాలన్నీ దళిత వ్యతిరేకులుగా  నిందను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా అని బీజేపీ ప్రతిపాదించిన ఈ అరెస్సెస్ నాయకుడికి మద్ధతు పలుకలేదు. కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలను ఈ విధంగా డోలాయమానంలో పడేయడం అనే ఈ రాజకీయ వ్యూహం అద్భుతమనే చెప్పాలి. ఇప్పుడు ఏమీ పాలుపోని స్థితిలో ప్రతిపక్షాలు తమ అభ్యర్ధిగా మాజీ స్పీకర్ శ్రీమతి మీరా కుమార్ ను రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా దళిత వ్యూహంతో మోదీ కొట్టిన తాజా దెబ్బ ప్రతిపక్షాలను అబ్బా అనిపిస్తోంది.  

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.