
పన్ను శ్లాబుల పై గుడ్ న్యూస్ ?
కేంద్రం ప్రవేశ పెట్టబోయే 2018-19 బడ్జెట్ లో ఎటువంటి అంశాలు ఉంటాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే బడ్జెట్ విషయంలో కేంద్రం ప్రక్రియను స్టార్ట్ చేసింది. ఈబడ్జెట్ లో సామాన్యులకు మోదీ సర్కార్ ఎటువంటి వరాలు ఇవ్వనున్నారా అని ఎదురుచూస్తున్నారు.. అలాగే మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుందా అని ఆలోచిస్తున్నారు.
వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థికమంత్రిత్వ శాఖ పెంచబోతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం మాత్రమే కాక, పన్ను శ్లాబులను సర్దుబాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రూ.2,50,000గా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.3,00,000కు పెంచాలనే ప్రతిపాదనలు ఆర్థికమంత్రిత్వ శాఖ ముందుకొచ్చినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పన్ను మినహాయింపును పెంచడంతో పాటు, శ్లాబులను సర్దుబాటు చేయడం మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా శాలరీ క్లాస్ వారికి ఎంతో మేలు చేకూరనుందని తెలుస్తోంది.
గతేడాది బడ్జెట్‌లో పన్ను శ్లాబులను మార్చనప్పటికీ, చిన్న పన్ను చెల్లింపుదారులకు స్వల్ప ఊరటనిస్తూ.. వార్షిక ఆదాయం రూ.2,50,000 నుంచి రూ.5,00,000 వరకు ఉన్నవారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. అయితే ఈ ఏడాది బడ్జెట్‌ను ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతుంది.
ఈ బడ్జెట్‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందట….అదేవిధంగా రూ.10-20 లక్షలు ఆదాయం ఉన్న వారికి 20 శాతం పన్ను విధించాలని , రూ.20 లక్షలు పైన ఆదాయమున్న వారికి 30 శాతం పన్ను రేటును విధించాలని చూస్తోంది కేంద్రం…. ద్రవ్యోల్బణం పెరగడంతో జీవన వ్యయాలు భారీగా పెరిగాయని, దీంతో మినహాయంపుల బేసిక్ పరిమితిని, పన్ను శ్లాబులను సర్దుబాటు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి….మరి చూడాలి ఎన్నికలకు మరో సంవత్సరం మాత్రమే సమయం ఉంది.. ఈ సమయంలో మోదీ సర్కార్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్