మోదీ ఎక్స్ ప్రెస్ 2018-19 రైల్వే బ‌డ్జెట్ హైలెట్స్

Modi Express 2018-19 Railway Budget Highlights for union budget

కాంగ్రెస్ త‌ర‌హాబ‌డ్జెట్ కు మూలాలు తెంచివేసి కొత్త‌గా రెండూ ఒకేరోజూ ప్ర‌వేశ‌పెట్టేలా ఆర్ధిక రైల్వే బ‌డ్జెట్ ల రూప‌క‌ల్ప‌ణ మోదీ వ‌చ్చిన త‌ర్వాత తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా రైల్వే కేటాయింపులు ఈ ఏడాది ఎలా జ‌రిగాయో చూద్దాం.
రైల్వే భద్రతకు పెద్ద పీట, సాంకేతిక పరిజ్ఞానం మరింత ఉపయోగించనున్నారు.
రైల్వేకు రూ.1,48,000కోట్లు కేటాయింపు
రైళ్ల ఆధునీకరణకు ముందడుగు. కొత్తగా రైల్వేలకు 12,000 వ్యాగన్లు, 5160కోచ్‌లు, 700 లోకోమోటివ్స్‌.
అన్ని రైల్లే స్టేషన్లలో దశలవారిగా వైఫై, సీసీటీవీల ఏర్పాటు
25 వేలమంది ప్రయాణీకులు వచ్చే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు
36 వేల కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ల పునరుద్ధరణ
4వేల కిలో మీటర్ల మేర కొత్తగా రైల్వే మార్గం
18 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు కేటాయింపు
దేశ వ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లు గుర్తించి వాటి అభివృద్ధి

!!ఎయిర్ వేస్ !! కేటాయింపులు 

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుతం 124 ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా వాటిని 5 రెట్లు పెంచనున్నాం. ఏడాదికి బిలియన్‌ ట్రిప్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నాం
ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం ద్వారా 56 అన్‌ రిజర్వడ్‌ ఎయిర్‌పోర్ట్‌ల, 31 అన్‌ సర్వడ్‌ హెలిప్యాడ్ల అనుసంధానం
దేశ వ్యాప్తంగా రహదారులు, ఎయిర్‌పోర్ట్‌లు, నౌకశ్రయాలకు మధ్య అనుసంధానం

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.