జనసేన నుంచి మంత్రి సోదరుడు ఎమ్మెల్యేగా పోటీ

Minister brother is the MLA to contest in Jansean Party

రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎలా కామన్ గా చెబుతారో, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు.. ఇది పక్కా వాస్తవంగా చెప్పాలి.. అయితే ఇప్పుడు ఎన్నికల సమయంలో రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది.. అన్నదమ్ములు, భార్య భర్తలు, పెద్ద నాన్న బిడ్డలు, బాబాయ్ కొడుకులు, బావ బావమరుదులు, పోటిలకు వారి వైరీ పార్టీల నుంచి సిద్దంగా ఉంటున్నారు.. అయితే టికెట్ వస్తే ఒకే టికెట్ రాకపోతే వేరే పార్టీ నుంచి పోటికి సై అంటున్నారు. ఇప్పుడు వైసీపీ తర్వాత జనసేనలోకి కూడా ఎక్కువగా చేరికలు ఉంటున్నాయి.

తెలుగుదేశం పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం చిన్న రాజప్ప సోదరుడు లక్ష్మణ మూర్తి ఆయనకీ, మరియు తెలుగుదేశం పార్టీకి ఊహించని షాకిచ్చారు. ఇదేమిటి సోదరుడు ఇలా చేయడం ఏమిటి అని అందరూ ఆలోచనలో పడ్డారు.. ఇంతకీ తూగోలో తిరుగులేని నాయకుడు సోదరుడు ఏమి చేశారు అంటే ఆయన జనసేనపార్టీలో చేరారు.. అంతేకాదు ఏపీలో పోటీ చేసే వారికి స్క్రీనింగ్ కమిటి పేర్లు ఫైనల్ చేస్తోంది ఈ సమయంలో ఆ కమిటికి లక్ష్మణరావు కూడా తన పేరు ఇచ్చారట. ఆయన దరఖాస్తు చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు ఇక.

ఇక్కడ మరో కొసమెరుపు ఏమిటి అంటే ఆయన ఏకంగా తన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నుంచి జనసేన తరపున పోటీ చేస్తాను అని అంటున్నారట. దీంతో తెలుగుదేశం నాయకులకు రాజప్ప కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా ఆలోచన వచ్చింది.. ముఖ్యంగా సీఎం కూడా ఆయనకు మరోసారి పెద్దాపురం నుంచి అవకాశం ఇస్తాను అని తెలియచేశారు.. ఈ సమయంలో అన్నదమ్ములు ఇద్దరూ ఇక్కడ నుంచి పోటికి ఉండటం పొలిటికల్ గా మరో వార్ అనే చెప్పాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.