Cinetollywood

మొత్తానికి చిరుతో నయనతారను ఫిక్స్ చేసారు!

Megastar Chiranjeevi next film Nayanathara will be female lead role

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ‘ఉయ్యాలవాడ నరసింహారె’డ్డి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22 న ఈ మూవీ లాంచింగ్ కు ముహుర్తంగా నిర్ణయించారు. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కావచ్చినా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న దానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు నయనతార ఈ మూవీ లో చిరు సరసన నటించేందుకు అంగీకరించినట్టు న్యూస్. నటనకు స్కోప్ ఉన్న ఈ పాత్రకు ముందు నుంచి నయనతారనే అనుకుంటున్నారట కానీ నయనతార సుముఖంగా లేనట్టు పుకార్లు వచ్చాయి. మొత్తానికి నయనతారను ఈ పాత్రకు ఒప్పించడంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ టీమ్ విజయవంతమైనట్టు తెలుస్తోంది.

అయితే ‘ఉయ్యాలవాడ’ లో మరో హీరోయిన్ గా ఐశ్చర్యారాయ్ ను అనుకొంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలన్ని ఎంత వరకూ నిజాలో తెలియాలంటే ఆగస్టు 22 వరకూ ఆగాల్సిందే. ‘ధృవ’తో సూపర్ హిట్ కొట్టి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.