Cinetollywood

మన దర్శకులపై నమ్మకం పోయిందా..? చిరంజీవికి కథలు దొరకడం లేదా :

Chiranjeevi: రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ (Chiranjeevi) తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన ఎంచుకుంటున్న కథలు చాలా మందికి అసంతృప్తినే మిగిలిస్తున్నాయి. వరస సినిమాలు చేస్తున్నాడనే పేరే కానీ ఆయన చేస్తున్న సినిమాలు మాత్రం ఓ వర్గం ప్రేక్షకులకు నిరాశనే మిగిలిస్తున్నాయి.

అదేంటి అంత మాట అనేసారు అనుకుంటున్నారా..? ఇప్పుడు  (Chiranjeevi) చేస్తున్న పనులు చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానాలు కలగక మానదు. బయటికి చెప్పడం లేదు కానీ ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫీలింగ్స్ ఇవే. ఎందుకంటే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత  (Megastar) తీసుకుంటున్న నిర్ణయాలు.. ఆయన ఎంచుకుంటున్న కథలు చాలా మందికి అసంతృప్తినే మిగిలిస్తున్నాయి. వరస సినిమాలు చేస్తున్నాడనే పేరే కానీ ఆయన చేస్తున్న సినిమాలు మాత్రం ఓ వర్గం ప్రేక్షకులకు నిరాశనే మిగిలిస్తున్నాయి. అంతగా ఆయనేం చేసాడబ్బా అనుకుంటున్నారా..? ఏం లేదు.. ఎక్కువగా రీమేక్ సినిమాలకే ఓకే చెప్పేస్తున్నాడు మెగాస్టార్. ఇదే చాలా మంది దర్శకులకు కూడా నచ్చట్లేదు. ఆయన ఊ అనాలే కానీ మెగాస్టార్ కోసం అదిరిపోయే మాస్ కథలు సిద్ధం చేయడానికి చాలా మంది దర్శకులు

హరీష్ శంకర్(Harish Shankar), (Puri Jagannadh) లాంటి దర్శకులు అయితే చిరు ఎప్పుడెప్పుడు అవకాశమిస్తారా అని వేచి చూస్తున్నారు. కానీ మెగాస్టార్ మాత్రం సింపుల్‌గా రీమేక్ సినిమాలకు ఓకే చెప్తున్నాడు. రిస్క్ తీసుకోడానికి సాహసించడం లేదా.. లేదంటే నిజంగానే సొంత కథలపై నమ్మకం పోయిందా అనేది అర్థం కావడం లేదు. తన ఇమేజ్‌కు సరిపోయే కథలు తెలుగులో రావడం లేదని మెగాస్టార్ రీమేక్ కథల వైపు వెళ్తున్నారా అని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఒకటి రెండు అంటే ఏమో అనుకోవచ్చు కానీ రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి కూడా చిరు రీమేక్ కథలనే ఎక్కువగా నమ్ముకుంటున్నాడు

అజిత్ (Ajith) హీరోగా వచ్చిన ఎన్నై అరింధాల్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చిరు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా తెలుగులో ఎంతవాడు గానీ పేరుతో డబ్ అయింది. అయినా కూడా మళ్లీ చిరు రీమేక్ చేయాలనుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. వెంకీ కుడుములకు ఈ సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ఇస్తున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. రీమేక్ సినిమాలు చేస్తే తప్పేంటి.. ఇవి కూడా కథలే కదా అని చెప్తుంటారంతా. కానీ చిరంజీవి లాంటి మెగాస్టార్ వరసగా రీమేక్ సినిమాలకే పరిమితం కావడం కూడా అంత మంచిది కాదని విశ్లేషకుల వాదన.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.