మెగాస్టార్ 151 మూవీ టైటిల్ మారిందా?

Megastar Chiranjeevi 151 movie title may change

ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో తీవ్ర ఆసక్తిని రేపుతున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా. ‘ఖైదీ నెంబర్ 150’ తో తిరుగులేని సక్సెస్ అందుకుని తనలో గ్రేస్ , సత్తా తగ్గలేదని నిరూపించుకున్న మెగాస్టార్ ఇప్పుడు 151 వ సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు మెగా టీమ్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటివరకూ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ అనే టైటిల్ నే అనుకున్నారు.

అయితే ఈ మూవీ టైటిల్ ను మార్చాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం. దర్శకుడు సురేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఈ సినిమా స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారు. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 న మూవీ ముహుర్తాన్ని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు టైటిల్ మార్పు తో మెగాభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘మహావీర’ అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.

‘బాహుబలి’ విజయం తర్వాత తెలుగు సినిమా స్టామినా పెరిగింది. దీంతో ఈ సినిమాను కూడా ఏకంగా మూడు భాషల్లో రూపొందించాలని నిర్మాణ రామ్ చరణ్ నిర్ణయించాడట. దీనివలన బడ్జెట్ ఎంత పెరిగినా సరే అంటున్నాడట. అందుకే దేశంలో అన్ని ప్రాంతాల వారికి క్యాచీగా ఉండేలా ‘మహావీర’ అనే టైటిల్ ను నిర్ణయించారని టాక్. మొత్తానికి ‘మహావీర’ అనే టైటిల్ మాత్రం అదుర్స్ అనేలా ఉందని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.