Cinetollywood

మహర్షి రివ్యూ

Maharshi-Live-Reveiw-2

చిత్రం: మహర్షి
నటీనటులు: మహేశ్‌బాబు, అల్లరి నరేష్‌, జగపతిబాబు, పూజ హెగ్డే, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: కె.యు. మోహనన్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌
కథ: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌
నిర్మాత: దిల్‌ రాజు, సి. అశ్వినీదత్‌, ప్రసాద్‌ వి. పొట్లూరి
దర్శకత్వం: వంశీ పైడిపల్లి

!!ఇంట్రో!! స్టార్ హీరోల సినిమాలు అంటే చాలా ఎక్సెప్టేష‌న్స్ ఉంటాయి.. ఇక బ‌రిలో చిన్న సినిమాలు కూడా ఉండ‌వు.. అలాంటి హీరో క‌మ‌ర్షియ‌ల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రిన్స్ మ‌హేష్ బాబు, త‌న 25 వ సినిమా మ‌హ‌ర్షిని విడుద‌ల చేశారు ..సామాజిక కోణాలు అంశాలు తీసుకుని సినిమాలు చేస్తున్నారు మ‌హేష్.. త‌న సినిమా ఫార్మెట్లో కొత్త‌గా మ‌హర్షిగా మారాడు. హీరోయిజానికి ఎక్క‌డా లోటు లేకుండా చూసుకుంటూనే ఓ బ‌ర్నింగ్ పాయింట్‌ని ఎంచుకున్నాడు.. మ‌రి వంశీ ఎలాంటి మార్క చూపించాడు మ‌హేష్ ఎలా న‌టించాడు అనేది ఓసారి చూద్దాం.

!!కథ‌!!
రిషి కుమార్ (మ‌హేష్ బాబు) ఓ కంపెనీకి సీఈఓ. ఓడిపోవ‌డం అంటే ఏమిటో తెలియని బిజినెస్మేన్‌. త‌న క‌ష్టాన్నీ, క‌ల‌ల్ని, విజ‌యానికి సోపానాలుగా మ‌ల‌చుకున్న వ్య‌క్తి. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి నేప‌థ్యం నుంచి వ‌చ్చి, అంచెలంచెలుగా ఎదుగుతాడు. అయితే త‌న జీవితం, త‌న విజ‌యాలు త‌నొక్క‌డి క‌ష్టానికి వ‌చ్చిన ప్ర‌తిఫ‌లాలు కాదని, వాటి వెనుక త‌న ఇద్ద‌రి స్నేహితుల (పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్‌) క‌ష్టం, త్యాగం కూడా ఉన్నాయ‌ని గ్ర‌హిస్తాడు. మ‌రి ఆ స్నేహితుల కోసం రిషి ఏం చేశాడు? విజ‌యం అంటే డ‌బ్బు సాధించ‌డ‌మే, స్థాయిని పెంచుకోవ‌డ‌మే అనుకునే రిషి – అస‌లుసిస‌లైన విజ‌యాన్ని ఎలా గుర్తించాడు? మ‌హ‌ర్షిగా ఎలా మారాడు? అనేదే క‌థ‌.

!!విశ్లేష‌ణ‌!!
మ‌హేష్ బాబు 25 వ సినిమాగా వ‌చ్చింది.. ఇక చాలా మంది ద‌ర్శ‌కులు ఈ సినిమా చేయాలి అని అనుకున్నా వంశీని న‌మ్మి మ‌హేష్ ఈ సినిమా చేశారు. మ‌హేష్ ప‌రిచ‌యం స‌న్నివేశాలు అన్నీ చాలా అందంగా తెర‌కెక్కించారు. విద్యార్ధిగా సీఈవోగా ఇలా అనేక వేరియేష‌న్స్ బాగా చూపించారు మ‌హేష్.. కాలేజీ నేప‌థ్యం, ముగ్గురు వ్యక్తుల మ‌ధ్య స్నేహం, విద్యావ్య‌వ‌స్థ‌పై వ్యంగ్య బాణాలు ఇవ‌న్నీ చూస్తే ‘త్రీ ఇడియ‌ట్స్’‌` గుర్తుకురావ‌డం స‌హ‌జం. కొత్త‌ద‌నం మాత్రం చూపించుకుంటూ వెళ్లారు మ‌హేష్. మొద‌టి భాగం విధ్యార్దులు అయితే రెండోవ భాగం రైతుల గురించి పోరాటం చేస్తాడు రిషి ల‌క్ష్యం కోసం ముందుకు వెళ‌తాడు.. మూడు గంట‌ల నిడివితో సినిమా సాగింది, మంచి పాయింట్స్ తీసుకోవ‌డంతో బాగా ఎలివేట్ అయింది.

న‌టుడిగా మ‌హేష్‌కి త‌న‌లోని వైవిధ్యాన్ని చూపించుకునే అవ‌కాశం ద‌క్కింది. త‌న పాత్ర‌లో మూడు షేడ్స్ ఉంటాయి. ఒక్కో షేడ్‌లో ఒక్కోలా క‌నిపిస్తాడు. సీఈఓగా స్టైలిష్‌గా క‌నిపించిన మ‌హేష్ – విద్యార్థిగా మాస్‌ని అల‌రిస్తాడు. రైతు స‌మ‌స్య‌లపై పోరాటం చేస్తున్న‌ప్పుడు త‌న‌లోని సిన్సియారిటీ క‌నిపిస్తుంది. మ‌హేష్ తెర‌పై మ‌రింత అందంగా క‌నిపించాడు. త‌న వ‌ర‌కూ అభిమానుల్ని అల‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. న‌రేష్ పాత్ర కూడా అద్బుతం అనే చెప్పాలి గ‌మ్యం సినిమా పాత్ర‌కు ఎంత పేరు వ‌చ్చిందో అంతే పేరు వ‌స్తుంది న‌రేష్ కు.

ఇక కథానాయికగా వరుస సినిమాలను చేస్తున్న పూజాహెగ్డేకు ఇందులో మంచి పాత్ర దక్కింది. ఆమెను కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం చేయ‌లేదు. క‌థానుసారం ఆ పాత్ర‌కూ ప్రాధాన్యం ఇచ్చారు. కాలేజ్‌ సన్నివేశాల్లో చిలిపితనంతో ఆకట్టుకున్న పూజా పాటల్లో మరింత గ్లామర్‌గా కనిపించింది. జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి స్టైలిష్ విల‌న్‌గా ఆక‌ట్టుకున్నారు. ఇక దేవీశ్రీ త‌న మ్యూజిక్ తో మ‌రోసారి మ్యాజిక్ చేశాడు ఇక సినిమాని అందంగా స్టైలిష్ లుక్ తో తీర్చిదిద్దారు నిర్మాతలు కూడా ఎక్క‌డా ఖ‌ర్చుకు వెన‌కాడ‌లేదు అని చెప్పాలిద‌ర్శ‌కుడు వంశీ పైడిపల్లి ఎంచుకున్న క‌థ బ‌ల‌మైన‌దే. తాను అనుకున్న విధంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. ఈ క‌థ మ‌హేష్ కు మాత్ర‌మే సూట్ అవుతుంది అని చెప్పాలి. అభిమానులు మాత్రం వేస‌విలో మంచి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు .ప్రిన్స్ కి ఇది మ‌రో విజ‌యం అనే చెప్పాలి.

!!బ‌లాలు !!
కథాంశం
మ‌హేష్ బాబు
నిర్మాణ విలువ‌లు
కాలేజీ స‌న్నివేశాలు

!!బ‌ల‌హీన‌త‌లు!!
నిడివి

బాట‌మ్ పాయింట్ — ఓ మంచి క‌థ .మ‌హ‌ర్షి

రేటింగ్-3

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.