Cinetollywood

Maha Samudram Trailer

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ

శర్వానంద్,  సిద్దార్థ్  కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దసరా కానుకగా విడుదలవుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.

జగపతి బాబు, రావు రమేష్, సిద్దార్థ్, శర్వానంద్, అదితి రావు హైదరీ, అను ఇమాన్యుయేల్ ఇలా ప్రతీ ఒక్క పాత్రకు ట్రైలర్‌లో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో శర్వానంద్, సిద్దార్థ్ అదరగొట్టేశారు. మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా? అంటూ జగపతి బాబును సిద్దార్థ్ నిలదీసే సీన్ బాగుంది. ఇక 
శర్వానంద్  చేసే యాక్షన్, ఎమోషనల్ సీన్స్ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా.. అందరూ నీ దగ్గరికే రావాలని అనుకుంటారు అని శర్వానంద్‌ను ఉద్దేశించి హీరోయిన్ చెప్పిన డైలాగ్, చిన్నప్పుడు దూరదర్శన్‌లో మహా భారతం సీరియల్‌ను చూశాను. ఎత్తులకు పై ఎత్తులు, బాణాలు వేయడం నేర్చుకున్నాను అంటూ రావు రమేష్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక జగపతి బాబు, శర్వానంద్ మధ్య ఉన్న రిలేషన్ అదిరిపోయేలా ఉన్నట్టుంది. ఇక చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోంది.

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.