
అసలేం జరిగిందో చెప్పిన నటి!..లక్ష్మీ మంచుకి యాక్సిడెంట్ గాయాలు
Mohan Babu – Vishnu Manchu : మంచు మోహన్‌బాబు నట వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న. ఈమెకు యాక్సిడెంట్ అయ్యింది. మోచేతికి, చేతి వేళ్ల దగ్గర, మోకాలు దగ్గర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా!
మంచు మోహన్‌బాబు నట వారసురాలుగా సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటి మంచు లక్ష్మీ ప్రసన్న. ఈమెకు యాక్సిడెంట్ అయ్యింది. మోచేతికి, చేతి వేళ్ల దగ్గర, మోకాలు దగ్గర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. తనకు తగిలిన గాయాలను ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు కంగారు పడ్డారు. అసలు మంచు లక్ష్మికి ఏం జరిగింది? బయట ఎక్కడా అసలు యాక్సిడెంట్ జరిగినట్లు వార్తలు రాలేదు కదా. కానీ ఆమెకు ఆ దెబ్బలు ఎలా తగిలాయా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. అయితే లక్ష్మీ మంచుకి జరిగిన యాక్సిడెంట్, చేతికి, కాలికి తగిలిన గాయాలు రియల్‌వి కావు.. రీల్ లైఫ్‌లో. వివరాల్లోకి వెళితే, లక్ష్మీ మంచు ఇప్పుడు మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి మాన్‌స్టర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్ర కోసం ఆమె చాలానే కష్టపడ్డారు. మలయాళంలో చాలా ఫేమస్ అయిన కలరిపట్టు విద్యను కూడా నేర్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా లక్ష్మీ మంచు వేసుకున్న మేకప్.. ఈ యాక్సిడెంట్.
కానీ ఆమె తన ఇన్‌స్టాలో అలాంటి ఫొటోలు షేర్ చేయడంతో అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు ఫోన్స్ చేయడం, మెసేజ్‌లు పెట్టడం చేశారు. దీంతో ఆమె స్పందిస్తూ అసలు విషయాన్ని చెప్పారు. షూటింగ్‌లో భాగంగా చేసినవే తప్ప.. నిజంగా ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. నా గురించి ప్రజలు ఆలోచిస్తారని తెలిసి చాలా ఆనందమేసింది. లవ్ యు ఆల్ అని మెసేజ్ పెట్టారు. దీంతో కంగారు పడ్డవారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్