Cinetollywood

కొత్తపేట కోట వైసీపీకి కంచుకోట‌?

Kothapeta kota YSRCP Kanchukota - Chirla jaggi Reddy

పేరులోనే కాదు రాజ‌కీయంగా కూడా ఇక్క‌డ కొత్త కొత్త ఫేస్ ల‌ను ఎన్నుకుంటారు ఈ ప్రాంత వాసులు… కొత్త పేట అంటే ఈ పార్టీ కంచుకోట అనేలా ఇక్క‌డ స్టాంప్ ప‌డ‌లేదు… బ‌హుశా తూర్పుగోదావ‌రి జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీ పేరు ఉండేది.. అయితే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన త‌ర్వాత రాజ‌కీయంగా ఇక్క‌డ మ‌రింత పోటీ పెరిగింది …క్యాస్ట్ డామినేష‌న్లు -ఆర్ధిక బ‌లాలు పెర‌గ‌డం అన్ని సామాజిక అంశాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని సీట్లు ఇవ్వ‌డం ఇక్క‌డ జ‌రిగింది.. అయితే కొత్త పేట రెడ్డి – కాపు సామాజిక‌వ‌ర్గాలు బ‌లంగా ఉన్న సెగ్మెంట్.

 

 2009 లో ప్రజారాజ్యం పార్టీ త‌ర‌పున గెలిచిన బండారు స‌త్యానంద‌రావు ఓ పార్టీలో ఉంటారు అనే బిరుదును సాధించుకోలేక‌పోయారు… ప్ర‌జారాజ్యం నుంచి ర‌య్యిమ‌ని చిరంజీవి కాంగ్రెస్ లొకి జంప్ అయితే, ఆయ‌న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు… అనివార్య‌ప‌రిస్దితుల్లో ఇక 2014 వ‌ర‌కూ ప్రజారాజ్యం కాంగ్రెస్ మెర్జింగ్ పార్టీలో ప‌నిచేశారు బండారు స‌త్యానందరావు.

 
ఇక తండ్రి రాజ‌కీయ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకున్న చిర్ల జ‌గ్గిరెడ్డి 2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున గెలిచారు… ఇక్క‌డ స‌త్యానందరావు మ‌ళ్లీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వ‌చ్చి అక్క‌డ ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా సైకిల్ పార్టీ పై నిల‌బ‌డ్డారు, అయితే 713 ఓట్ల ఆధిక్య‌త చిర్ల జ‌గ్గిరెడ్డి సొంతం చేసుకున్నారు ప్ర‌త్య‌ర్ది బండారు స‌త్యానంద‌రావు పై ..

 
 కొత్త పేట సెగ్మెంట్ నుంచి స‌త్యానంద‌రావు మూడు సార్లు ఎమ్మెల్యే అయితే, ఇటు జ‌గ్గిరెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా శాస‌న స‌భ‌కు వెళ్లారు. ఇక్క‌డ జ‌గ్గిరెడ్డి 2004 లో కాంగ్రెస్ త‌ర‌పున విజ‌యం సాధించారు.. 2009 లో ప్రజారాజ్యం వేవ్స్ ఉండ‌టంతో జిల్లాలో కాపు సెగ్మెంట్ పై చిరు గురి పెట్ట‌డంతో ప్ర‌జారాజ్యం త‌ర‌పున స‌త్యానంద‌రావు విజ‌యం సాధించారు…. ఇక 2014 లో జ‌గ్గిరెడ్డి కొత్త‌పేట‌కు కొత్త‌గా ఎన్నికయ్యారు రెండోవ‌సారి ఎమ్మెల్యేగా.

 
కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే ఇక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కూ 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి.. ఇందులో కాంగ్రెస్ పార్టీ -ఇందిరా కాంగ్రెస్ క‌లిసి ఏడు సార్లు అధికారం సాధించుకోగా, తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు గెలిచింది, జ‌న‌తాపార్టీ -వైసీపీ -ప్ర‌జారాజ్యం ఒక్కోసారి విజ‌యం సాధించాయి.

 
ఇక స‌త్యానంద‌రావు 1994-99 లో తెలుగుదేశం త‌ర‌పున, అలాగే  2009 లో ప్ర‌జారాజ్యం పార్టీ త‌ర‌పున విజ‌యం సాధించారు ఎమ్మెల్యేగా .. అయితే నాడు తండ్రి రాజ‌కీయంగా ఎదురునిలిస్తే నేడు ఆయ‌న త‌న‌యుడు జ‌గ్గిరెడ్డి బండారు స‌త్యానంద‌రావుకు ఎదురునిలుస్తున్నారు…ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డి తండ్రి సోమ‌సుంద‌రరెడ్డి 1983 లో టీడీపీ త‌ర‌పున గెలిచారు, అలాగే 1989 లో కాంగ్రెస్ త‌ర‌పున గెలిచారు, ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న పై  తెలుగుదేశం త‌ర‌పున బండారు స‌త్యానందరావు నిల‌బ‌డి ఓట‌మి పాల‌య్యారు

 
అయితే ఇప్పుడు ఇక్క‌డ ప‌రిస్ధితి మొత్తం జ‌గ్గిరెడ్డికి ప్ల‌స్ అవుతోంది… తెలుగుదేశం అధికారంలో ఉన్నా బండారు హావా ఎక్క‌డా ప‌నిచేయ‌డం లేదు అంటున్నారు ఇక్క‌డ ప్ర‌జలు.. ప్రోటోకాల్ అంశంలో జగ్గిరెడ్డి బండారు వారి ప‌రువును మినిస్ట‌ర్ ముందు రోడ్డున‌పెట్టారు… ఇక్క‌డ తెలుగుదేశం ఎలా ఉన్నా కుల స‌మీక‌ర‌ణాలు గ‌తంలో కంటే మారాయి, తెలుగుదేశం కంటే వైసీపీకి మ‌ద్ద‌తు పెరుగుతోంది.. కావాల‌నే నిధులు ఆపాల‌ని ఇక్క‌డ అభివృద్దికి తెలుగుదేశం అడ్డుప‌డుతోంది అనేది తెలుస్తోంది..

 
 జ‌గ్గిరెడ్డి ప్ర‌జ‌ల్లో అంద‌రికీ వెళ్లేలా ఈ విష‌యాన్ని తీసుకువెళుతున్నారు.. పైగా అంద‌రితో క‌లిసి మెలిసి మెలగ‌డం యువ‌త‌కు పెద్ద‌పీట వేయ‌డం సెగ్మెంట్లో వైసీపీ కార్య‌క్ర‌మాలు ఎమ్మెల్యేగా మ‌రింత స్పీడుగా  తీసుకువెళ్ల‌డం కూడా జిల్లాలో మ‌రింత కొత్త‌పేటకు పేరు తీసుకువ‌చ్చింది… ఇటు ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే టీం ఇక్క‌డ పార్టీ పై 80 శాతం ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త ఉంది అని తెలియ‌చేశారు..

 
 ఇటు తెలుగుదేశం అధికారంలో ఉన్నా బండారు స‌త్యానందం ఎటువంటి ప‌నులు చేయించ‌లేక‌పోతున్నారు అనే విమ‌ర్శ‌లు ఉన్నాయి..జిల్లాలో ఇరువురు మంత్రులు ఉన్నా వారి సెగ్మెంట్ల పై ప‌ట్టుతోనే స‌రిపోతోంది అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి… అయితే ఇటు తెలుగుదేశం త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ప‌క్కా అని బండారు ఫిక్స్ అయ్యారు, అయితే ఇటు జ‌గ్గిరెడ్డి జ‌గ‌న్ వ‌స్తే మినిస్ట‌ర్జి అవుతారు అని ప్ర‌జ‌ల్లో బ‌లంగా వెళ్లింది దీనికి కార‌ణాలు కూడా ఉన్నాయి… 

దాడిశెట్టి రాజా తుని ఎమ్మెల్యేగా ఉన్నారు వైసీపీ త‌ర‌పున అలాగే కొత్త‌పేట నుంచి చిర్ల జ‌గ్గిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు  తెలుగుదేశం ఎంత ప్ర‌లోభాల‌కు గురిచేసినా పార్టీ మార‌ని నాయ‌కుడు జ‌గ్గిరెడ్డి అని జ‌గ‌న్ అంద‌రి స‌మక్షంలో అనే అంత చ‌నువు జ‌గ‌న్ తో ఆయ‌ను ఉంది. 

 
ఇటు రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రి, ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, జ‌గ్గం పేట జ్యోతుల నెహ్రూ పార్టీ ఫిరాయించారు అనేది తెలిసిందే వీరిలో ఒక్క‌రికి కూడా బాబు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు అనేది జ‌గ‌మెరిగిన స‌త్యం.
జిల్లాలో జ‌గ‌న్ ను న‌మ్ముకుని పార్టీని నిల‌బెట్టిన‌-  నిల‌బ‌డిన కేండిడేట్ గా ఆయ‌న‌కు మైలేజ్ ఉంది… ఇక మ‌రోసారి ఎమ్మెల్యేగా జ‌గ్గిరెడ్డి 2019 లో అసెంబ్లీకి వెళ్ల‌డం ప‌క్కా అంటున్నారు ప్ర‌జ‌లు, జ‌గ‌న్ ఎప్పుడో బీఫాం ఇచ్చారు అనేది సత్య‌వాక్కు… ఇటు తెలుగుదేశం పై వ్య‌తిరేక‌ప‌వ‌నాలు బండారు స‌త్యానంద‌రావుకు మ‌రింత మైన‌స్ అవుతున్నాయి అనేది కొత్త‌పేట‌లో కొత్త వార్త. 
విశ్లేష‌ణ !! వీజీ 

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.