Cinetollywood

కొరటాల చిరు మూవీ వచ్చే ఏడాదే …చరణ్ కు కండిషన్స్

koratala siva and chiranjeevi movie updates

మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం మెగాస్టార్ చిరంజీవి కొరటాల చిత్రం.. ఈ సినిమా టైటిల్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమి విడుదల అవుతుందా అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు, అయితే ఈ సినిమాని కూడా షూటింగ్ కేవలం 100 రోజుల్లో పూర్తి చేస్తారు అని వార్తలు వస్తున్నాయి, ఇక చిరు సరసన త్రిష కూడా నటిస్తోంది.

అనుకున్నట్లుగా చిత్ర యూనిట్ ఈ సినిమాను ఈ ఏడాది దసరాకి విడుదల చేయాలని భావించారు. కానీ వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అయితే వంద రోజుల్లో షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమా ఎడిటింగ్ పూర్తి చేసి కచ్చితంగా వస్తుంది అని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్న సమయంలో,ఈ వార్త ఫ్యాన్స్ కి షాక్ తెప్పించింది.

ఈ సినిమాలో చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించనున్నాడు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న చరణ్, అదే లుక్ తో కొరటాల సినిమా చేయడం కుదరదు. అయితే ముందుగా చరణ్ షూటింగ్ అక్కడ పూర్తి చేయాలి అని చూస్తున్నారు.. అక్కడ చరణ్ షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇక్కడ కొరటాల చిత్రంలో చరణ్ నటిస్తారట, అయితే ఆర్ ఆర్ ఆర్ కి కండిషన్ కూడా ఉంది ఇది విడుదల అయిన తర్వాత చరణ్ వేరే చిత్రం చేయాలి అని ఉంది, సో అందుకే ఈ సినిమా విడుదల ఫిబ్రవరి అవుతుంది అని అంటున్నారు, వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో వస్తుందట చిరు చిత్రం.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.