కాపులు ఎవరికి కాపు కాచారు బాబుకు కొత్త దెబ్బ

Kapu votes poll which party YSRCP, Janasena, TDP

ఈసారి అత్యధిక సీట్లు గెలుస్తాం అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.. అంతేకాదు సుమారు 135 నుంచి 140 సీట్లు తెలుగుదేశానికి పక్కాగా వస్తాయి అని చెబుతున్నారు…అలాగే టీడీపీకి మొత్తం అన్ని వర్గాలు ఓట్లు వేశాయి అని చెబుతున్నారు.. అయితే ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజల అభిప్రాయం ఇంకా తేలాల్సి ఉంది, అంటే మే 23 వరకూ ఫలితాల కోసం ఆగాల్సిందే.. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పవన్ కల్యాణ్ వల్ల చాలా ప్లస్ అయింది, ముఖ్యంగా పవన్ అభిమానులు కాపులు కూడా రిజర్వేషన్ ల విషయంలో బాబుని నమ్మి ఓట్లు వేశారు. 65 శాతం కాపులు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని ఆ నాడు సర్వేలు తెలియచేశాయి. అందుకే జగన్ కు పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కస్దానం కూడా రాలేదు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొన్ని స్ధానాలు మాత్రమే వచ్చాయి.

ఇక తర్వాత పవన్ తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు.. కాపులు అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారా అంటే? కొందరు పవన్ వెంట ఉన్నారు. ముఖ్యంగా యువత పవన్ వెంట ఉన్నారు. అయితే జగన్ ఇక్కడ ఒక ఆలోచన ఆలోచించారు.. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్ వారికి ఉపయోగపడి కాపుల ఓట్లు తెలుగుదేశానికి పడ్డాయి ..ఇప్పుడు పవన్ నేరుగా బరిలోకి దిగడంతో తెలుగుదేశానికి గతంలో ఓటు వేసిన వారు, పవన్ కల్యాణ్ కు ఓటు వేస్తారు అని, దీని వల్ల వైసీపీకి నష్టం ఏమీ లేదు అని జగన్ గుర్తించారు. అందుకే వీరిని ఇద్దరికి పెద్ద పట్టించుకోలేదు అని చెబుతుంటారు.

అయితే కాపులు ఆర్దికంగా బలంగా ఉన్న సెగ్మెంట్లలో వారికి కాకుండా వేరే వారికి టిక్కెట్లు ఇవ్వడం కూడా తెలుగుదేశం పార్టీకి కొన్ని చోట్ల మైనస్ అయింది.. ఇక జనసేన టీడీపీకి దూరం అయి నేరుగా పోటీ చేయడం కూడా పార్టీకి మైనస్ అయింది… కాపులు చాలా వరకూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు అని అంటున్నారు.. ముఖ్యంగా జనసేన ఇక్కడ లాభపడింది అని తెలుస్తోంది.. అయితే పొత్తు ధర్మంలో కూడా తెలుగుదేశం జనసేనకు 2014 ఎన్నికల్లో ఉమ్మడిగా పడిన ఓట్లు, ఇప్పుడు జనసేనకు లాభించాయి.. అయితే జగన్ కు కొత్తగా వచ్చిన యువత నుంచి కూడా సగం సపోర్టు ఉంటోంది. అయితే ఫీజు రియింబర్స్ మెంట్ అలాగే కాపుల రిజర్వేషన్ల అంశం తెలుగుదేశం పార్టీ నుంచి యువతను మరింత దూరం చేశాయని తెలుస్తోంది.

ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా కాపు ఓటర్ల శాతం దాదాపు 18% నుంచి 21 % వరకు ఉన్నారు గణాంకాలు పరిశీలిస్తే… కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే, ఎంపీ గెలుపులో వీరి ఓట్లే అత్యంత కీలకంగా వ్యవహరించే పరిస్థితులు కూడా ఉన్నాయి. వారందరూ కలిపి ఎవరికి ఓటేశారు..? అందులో టీడీపీకి ఎన్ని పడ్డాయి..? జనసేనకు ఎన్ని పడ్డాయి..? వైసీపీకి ఎన్ని పడ్డాయి..? అన్న ప్రశ్నలపై ఏపీ రాజకీయ సర్కిల్స్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే ఎవరి ఆలోచన ఎలా ఉన్నా యంగస్టర్స్ మాత్రం 50 శాతం వైసీపీ వైపు ఉన్నారు అని, 50 శాతం జనసేన వైపు ఉన్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఈసారి కాపులు ఎక్కువ కాపు కాచింది జనసేనకు వైసీపీకి అనేది ఫలితాలు రాకముందే విశ్లేషకులు చెబుతున్నారు .. మరి మే 23 న ఇందులో వాస్తవాలు తేలతాయి.

విశ్లేషణ-వీజీ

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.