జగన్ లక్ష కోట్లు దోచుకోలేదు బాబుకు షాకిచ్చిన జేడీ

JD Lakshminarayana Change his Tone on about Jagan

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పే మాట ఒకటే …తనపై అన్యాయంగా లక్ష కోట్లు దోచుకున్నాను అని ఆరోపణలు చేస్తున్నారు అని అనేవారు.. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు నిజం అయ్యాయి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి తనపై కుట్రచేసి కేసులు వేశారు అని జగన్ ఆనాటి నుంచి చెబుతూనే ఉన్నారు. అన్యాయంగా 16 నెలలు జైలులో పెట్టారు అని అంటారు, దీనిని సాకుగా టీడీపీ చూపించి ఎన్నికల్లో లబ్ది పొంది 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. అయితే ఇలా జగన్ కేసులు డీల్ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జగన్ కేసుల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడలేదని.. అవన్నీ నిరాధార ఆరోపణలేనని లక్ష్మీనారాయణ అన్నారు. జగన్ లక్షకోట్ల దోపిడీ ఆరోపణలన్నీ రాజకీయ ఆరోపణలేనని, తాను పరిశోధించిన కేసుల ప్రకారం 1500 కోట్లు మేరకు మాత్రమే అవకతవకలు జరిగినట్లు గుర్తించానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా లక్ష్మీనారాయణ తెలిపారు. కేవలం మేము గుర్తించిన 1500 కోట్లు చార్జ్ షీట్లో పేర్కొన్నాము అని అన్నారు, ఇక రాజకీయంగా వారు విమర్శలు చసుకుంటే తాను వాటికి బాధ్యుడ్ని కాదు, నేను ఉద్యోగ ధర్మం పాటించాను అని ఆయన అన్నారు.

ఇక జగన్ పై తెలుగుదేశం నేతలు చేసే ఆరోపణలు అవాస్తవం అని ఆయన చెప్పకనే చెప్పారు.. ఈ ఎన్నికల్లో కూడా జగన్ పై ఇలాంటి ప్రచారం చేశారు తెలుగుదేశం నేతలు సీఎం చంద్రబాబు.. ముఖ్యంగా జగన్ అవినీతి పరుడు అంటూ ప్రచారం చేశారు.ఎల్లో మీడియాలలో జగన్ పై దుష్ప్రచారం చేశారు, అయితే జగన్ కేసులు చూసిన లక్ష్మీనారాయణ ఇలా చెప్పడంతో ఇప్పుడు తెలుగుదేశం మరోసారి ఇలాంటి కామెంట్లు చేస్తే సరైన గుణపాఠం చెబుతాం అంటున్నారు వైసీపీ నేతలు.. ఇది బాబుకు జీర్ణించుకోలేని క్లారిటీ అంటున్నారు వైసీపీ నేతలు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.