
జయసుధకు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవి
ఏపీలో ప్రభుత్వం మారిపోయింది, ఇక నామినేటెడ్ పోస్టులకు కూడా టీడీపీ నేతలు వరసు పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. , ఇక పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా ఆ పదవులు పొందిన వారు రాజీనామాలు చేయాలి అనే రూల్ ఉంది.. అందుకే అందరూ ఇప్పుడు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు.. ఈ సమయంలో పార్టీలో చాలా మంది వైసీపీ నేతలు పార్టీకోసం కష్టపడిన వారు ఆపదవులు తమకు వస్తాయి అని ఆశలో ఉన్నారు ..అయితే జగన్ కూడా వీటిని అన్నింటిని ఒకరోజు చర్చించి ఏ పోస్టు ఎవరికి అనేది ఫిక్స్ చేయనున్నారట.
ఒకసారి ఎన్నిక సమయలోకి వెళితే, ఈ ఎన్నికల్లో సినీ రంగానికి చెందిన మోహన్బాబు, జయసుధ, .జీవిత, రాజశేఖర్ అలీ, పోసాని, పృథ్వీ సహా పలువురు ఆర్టిస్టులు వైసీపీ తరపున ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ కు వీరి ప్రచారం కూడా చాలా పస్ల్ అయింది. అయితే జగన్ గెలిస్తే వీరికి పదవులు వస్తాయి అని కొందరు భావించారు. ఎన్నికల్లో వై.ఎస్.జగన్ విజయం సాధించి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాము మద్దతు ఇచ్చిన పార్టీ అధికారంలోకి రావడంతో తమకు కీలకపదవులు దక్కుతాయని కొందరు సినీ ప్రముఖులు భావిస్తున్నారట. ఇప్పటికే మంచు మోహన్ బాబుకు తితిదే చైర్మన్ పదవి వరిస్తుంది అని , ఆయన రేసులో ముందు ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఇప్పుడు మరో పదవి గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
రీసెంట్గా ఆంధప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి అంబికా కృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎఫ్.డి.సి ఛైర్మన్ పదవి ఎవరికి దక్కనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే జగన్, ఎఫ్.డి.సి చైర్మన్ పదవికి జయసుధ అయితే బావుంటుందని యోచిస్తున్నారని టాక్. సీనియర్ నటి, ఇండస్ట్రీలో అందరితో సత్సంబంధాలు ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. ఆమె కూడా ఆ పదవి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. మరి చూడాలి ఈ పదవి ఎవరిని వరిస్తుందో.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్