జ‌న‌సేన హామీలు అదిరిపోయాయి జ‌నం చ‌ర్చ‌లు

Janasena manifesto peoples saying is good

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పేద ప్ర‌జ‌ల‌కు తన పార్టీ త‌ర‌పున కీల‌కమైన హామీలు అయితే ఇచ్చారు అని చెప్పాలి. పేద‌ల‌కు జ‌న‌సేన ఇ ప్పుడు కేరాఫ్ అడ్ర‌స్ గా క‌నిపిస్తోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల శంఖారావం పూరించారు.రాజమహేంద్రవరం వేదికగా జరిగిన ఆ పార్టీ ఐదో ఆవిర్భావ దినోత్సవ సభలో హామీల జల్లు కురింపించారు. టీడీపీ వైసీపీకి ధీటుగా స‌రికొత్త‌గా ప‌వ‌న్ హామీలు ఉన్నాయి అని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక రైతుల స‌మ‌స్య‌ల‌పైఎక్కువగా దృష్టిపెట్టే ప‌వ‌న్ క‌ల్యాణ్, రైతుల‌కు వ‌రాలు ఇచ్చారు అని చెప్పాలి. ఒక‌సారి ఆయ‌న పార్టీ త‌ర‌పున ఇచ్చిన హామీలు ఇప్పుడు చూద్దాం.

ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు
ఎవరూ లంచం అడగని వ్యవస్థ రూపకల్పన
డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజనం
ప్రభుత్వోద్యోగుల కోసం సీపీఎస్‌ రద్దు
బీసీలకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్లు
నదులు అనుసంధానం చేసి కొత్త జలాశయాలు నిర్మాణం
మత్స్యకారుల రుణాల కోసం ప్రత్యేక బ్యాంకు. వేటకు వెళ్లని సమయంలో వారికి రోజుకు రూ.500ఆర్థిక సహాయం. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపు అందరికీ సురక్షిత మంచినీటి సరఫరా
అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు
ముస్లింల అభ్యున్నతి కోసం సచార్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు
స్త్రీలకు అండగా ఉండే, భద్రత కల్పించేలా కఠిన చట్టాల రూపకల్పన. ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక బ్యాంకు, ఆస్పత్రి నిర్మాణం
మహిళలకు శాసనసభలో 33శాతం రిజర్వేషన్లు
డ్వాక్రా సంఘాల మహిళలకు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం
ఆడపడుచులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు
అన్ని మతాల మహిళలకు ఆయా పండుగలకు చీరల పంపిణీ
ప్రతి మండలానికి కల్యాణ మండపం నిర్మాణం
మహిళా ఉద్యోగుల కోసం శిశు సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు
మహిళలకు పావలా వడ్డీకే రుణాలు

ఈ హామీల‌పై ప్ర‌జ‌లు కూడా ప‌వ‌న్ ఆలోచ‌న ఆయ‌న హమీలు బాగున్నాయి అని చెబుతున్నారు. సో ఎన్నిక‌ల్లో ఎటువంటి ఫ‌లితాలు ఇస్తాయో చూడాలి ఈ మేనిఫెస్టోలు.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.