జనసేన సీఎం అభ్యర్థి ఎవరంటే!!

Janasena CM Candidate announced

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు సినీ రంగంలోనూ యిటు రాజకీయాలలోని దూసుకుపోతున్నారు. ఒకవేళ 2019 జనసేన పార్టీ  ఎన్నికల్లో నెగ్గినా సీఎంగా పవన్‌కల్యాణ్ ఉండరని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎక్కడైనా ఒక  పార్టీ అధినేతే రాష్ట్రానికి సీఎంగా ఉండటం సంప్రదాయంగ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నారని సమాచారం. జనసేన అధినేత మాటలు, ఆలోచన తీరు దీనికి నిదర్శనం. 2019లో జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ ఇప్పటికే స్పటం చేసారు.

అయితే జనసేనాని ఇప్పటి వరకు ప్రభుత్వాలను నిలదీయటం, ఉదాన సమస్యను ఒక కొలిక్కి తీసుకురావటంలో తనదయిన సిలీలో దూసుకుపోయారు అంతేకాక  సేవా కార్యక్రమాలకు తానై పవన్ కళ్యాణ్  దూసుకుపోతున్నారు. 2019 ఎన్నికలలోకి దాదాపు బరిలో దిగినట్టే అనిపిస్తుంది. యిప్పుడు పవన్ తన ఒప్పుకొని  ఉన్న సినిమాలన్నీ అయిపోయాక పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా మారనున్నారు అని సమాచారం. 2014లో ఎన్నికలలో  కొత్త రాష్ట్రానికి చంద్రబాబు లాంటి సమర్ధుడు, కార్యశీలుడు అవసరమని ఆయనకు మద్దతు ఇచ్చారు గెలిపించారు. అప్పుడు ఆ సమయంలో జగన్‌కు అనుభవం లేదని పవన్ అభిప్రాయపడ్డారు. కాబట్టి అధికార పిచ్చి లేదని నిరూపించడానికి ప్రజల కోసము మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని అనేకసార్లు అనేక సందర్భాలలో చెప్పుకొచ్చారు. జనసేనాని అభిప్రాయం ప్రజల సేవకు అధికారం అవసరం లేదని ఆయన బలీయమైన అభిప్రాయం. దీన్ని బట్టి 2019లో అనుభవం ఉన్న ఇతర పార్టీలతో జనసేన పొత్తు ఖాయమని తేలింది. సీఎం పదవి కూడా ఆయన అలంకరించకపోవచ్చు. ఆ పార్టీ కూటమి తరుపున సీఎం ఎవరు అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. లెప్ట్, కాంగ్రెస్ ఉమ్మడి కలయికతో జనసేన పోటీలోకి దిగవచ్చు. ఆ సందర్భంలో పవన్ చాలా తెలివిగా తన అన్న మెగాస్టార్ చిరంజీవిని సీఎం కుర్చీలో కూర్చోబెడుతారని కొందరి అంచనా వేస్తున్నారు. విడిపోయినట్లు బయటికి కనిపిస్తున్నా.. కలిసి పనిచేసే దిశగానే పొత్తు అనే అందమైన పేరుతో చిరంజీవి సీఎం కావచ్చు. తన అన్న కాంగ్రెస్‌లో ఉండడంతో.. తాను కాంగ్రెస్ పార్టీ మనిషినేనని చెప్పుకున్న మరో సోదరుడు నాగబాబు ఆ తర్వాత జనసేన వైపు మళ్లారు.వేచిచుదాం ఏమి జరుగుతుందో.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.