పవన్ స్పీడుకు టీడీపీ వైసీపీ షేక్

Pawan Kalyan

ఏపీలో పవన్ కల్యాణ్ పొలిటికల్ గా మరింత దూసుకుపోతున్నారు అనే చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా పవన్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఇక నాలుగు సంవత్సరాలుగా వైసీపీ తెలుగుదేశం ఎంత కష్ట పడి నిర్మించుకున్నా, సోషల్ మీడియా వింగులను తలదన్నే విధంగా పవన్ సోషల్ మీడియా ఉంది. ముఖ్యంగా పవన్ కు కూడా పొలిటికల్ గా అడ్వైజ్ లు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో నేతలు ఉన్నారు. అయితే ఇవన్నీకుతంత్ర రాజకీయాలు అని తాను నిస్వార్దంగా రాజకీయాల్లో సేవ చేస్తాను అని చెబుతున్న పవన్ కు, ఇప్పుడు ప్రజల్లో కూడా ఫాలోయింగ్ పెరుగుతోంది..జనవరి కల్లా తన పార్టీ తరపున 175 నియోజకవర్గాల్లో అభ్యర్దులను ప్రకటించే పనిలో ఉన్నారు ఆయన. ఇక సెగ్మెంట్ల వారిగా జనసేన పేజీలు, గ్రూపులు సోషల్ మీడియాలో వైరల్ చేయనున్నారు. ఇప్పటికే 10 నుంచి 15 మంది అభ్యర్దులను, ఆయన ఇంటర్నల్ గా ఫిక్స్ చేశారు అని అంటున్నారు.

ఇక ఆయన ఫుల్ గా రాజకీయంగా ఉన్నారు. సినిమాలను పక్కన పెట్టారు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తు మరో ఆరునెలల్లో తేలిపోతుంది. అలాగే రాజకీయంగా తెలుగుదేశం వైసీపీ ఎన్నికుయుక్తులు జనసేనపై చేసినా, అవన్నీ ఆయన పట్టించుకోవడం లేదు.. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేందుకు ఆయన సిద్దం అవుతున్నారు.. తెలుగుదేశం పార్టీ వైసీపీ కంటే ఎక్కువగా ట్రోల్ చేస్తోంది పవన్ కల్యాణ్ ని. అయితే పవన్ సేన కూడా జనసేన నుంచి అత్యధిక వైరల్ పోస్టులు పెడుతున్నారు. ఇది పార్టీకి ఫుల్ జోష్ నింపుతోంది. ముఖ్యంగా వైసీపి తర్వాత జనసేన, కాంగ్రెస్ – బీజేపీ కంటే ముందు వరుసలో ఉంది సోషల్ మీడియాలో.. పైగా పవన్ ఎక్కడా పెయిడ్ బ్యాచ్ ని దీనికి ఉపయోగించుకోవడం లేదు. ఇది ఇక్కడ పెద్ద చర్చ జరుగుతున్న అంశం. అందుకే సోషల్ మీడియాలో పవన్ మరో శిఖరానికి వెళ్లారు అనే చెప్పాలి.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.