పవన్ జగన్ కి ఏమి చెప్పాడు !!

Janasena Chief Pawan Kalyan about pothulu YSRCP

వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి అవ్వాలన్న జగన్ రాజకీయ వ్యూహాలు పదును ఎక్కించే దిశగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ని రంగం లోకి దించిన విషయం అందరకి తెలిసిందే .అయితే ఇదిలా ఉంటె ప్రశాంత్ కిశోర్ ఇస్తున్న సలహాలు బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా వాటి అమలు మాత్రం సత్యదూరం గా ఉన్నాయి .సలహాలు ఇవ్వటం చాలా సులభమయిన పని  కానీ అవి ఎంత వరకు అమలు చేయగలమో అన్న కనీస పరిజ్ఞానం లేకుండా చేస్తుండటం జగన్ పరిస్థితి మొదటికే మోసం వచ్చేలా ఉంది.

ప్రశాంత్ కిశోర్ సలహా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తో మరియు వామపక్షాలతో కలసి మహాకూటమి గా ఎన్నికల బరిలో దిగితే విజయం వరిస్తుంది అనేది సలహా బాగానే ఉంది కానీ వామపక్షాల సంగతి అలా ఉంచితే పవన్ కళ్యాణ్ జగన్ వైపు మొగ్గు చూపుతాడు అనేది మాత్రం జరిగే పని కాదు అని మొదటి నుంచి మనం అనుకుంటున్న మాటే. ఈ దశలో గత కొద్ది రోజులు గా పవన్ కళ్యాణ్ ని పర్సనల్ గా కలిసి ఎలాగోలా ఆయన్ని బుజ్జగించాలి అని ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అప్పాయింట్మెంట్ కోరిన ప్రశాంత్ కి పర్సనల్ గా కలవటానికి ఎటువంటి ఇబ్బంది లేదు రాజకీయ కారణాల కోసం లేక పొత్తు గురించి చర్చించటానికి అయితే కలవాల్సిన అవసరం లేదు అని చెప్పినట్లు విశ్వసనీయవర్గాల నుంచి తెలుస్తుంది.ఇదే నిజమయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల సన్నాహాలు ఎలా ఉన్నా జగన్ పార్టీ తో మాత్రం ఎటువంటి పరిస్థితి లో కలిసే సమస్యే లేదు అన్న విషయం తెలినట్లే.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.