
అన్నదమ్ములతో తలపడిన జగ్గిరెడ్డికి జయమేనా ?
రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది చెప్పలేము… ముఖ్యంగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఓ సెగ్మెంట్ గురించి అందరూ చర్చించుకుంటున్నారు… ఎందుకు ఈ చర్చ అంటే? కురుక్షేత్రంలో కూడా అన్నదమ్ములే కొట్టుకున్నారు, లక్షల మంది సైన్యంతో యుద్దం చేశారు. ఇప్పుడు కూడా పార్టీలు వేరు అయినా అన్నదమ్ములు ఎన్నికల్లో సవాళ్లు ప్రతిసవాళ్ల నడుమ ఎన్నికల్లో తలపడుతున్నారు. పార్టీ తరపున విజయం సాధించేందుకు పక్కా ప్రణాళికలు రచించేందుకు గతంలో సోదరులు సాయం చేసేవారు, కాని ఇప్పుడు సోదరులను ఓడించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు .రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. కొత్తపేట కోనసీమ ప్రాంతంలో కీలకమైన ప్రాంతం. ఇక్కడ అభివృద్ది ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో అంతే రాజకీయంగా ఫాస్ట్ గా ఉంటారు నాయకులు. కొత్తపేటలో చిర్ల కుటుంబం రాజకీయంగా ఇప్పుడు ఉన్నవారిలో పేరు సంపాదించిన కుటుంబం, కీశే. చిర్ల సోమసుందర రెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నారు, ఆయనకు మరోసారి జగన్ అవకాశం ఇచ్చారు ముచ్చటగా ఈసారి ఆయన గెలుపుతో మూడు సార్లు ఎమ్మెల్యే అవుతారు అనేది పబ్లిక్ టాక్.
ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున బండారు సత్యానందరావు అలాగే జనసేన నుంచి బండారు శ్రీనివాసరావు పోటీ చేశారు.. వీరిద్దరూ అన్నదమ్ములే, 20 ఏళ్లు అన్నకు రాజకీయంగా తోడ్పాటు అందించిన తమ్ముడు జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి సపోర్ట్ చేయకుండా తన దారి తానుచూసుకున్నాడు.. సో రాజకీయాల్లో ఎవరి ఇష్టం వారిది, గాంధీ కుటుంబం కూడా అంతే ఇటు సోనియా కాంగ్రెస్ లో ఉంటే, మేనకాగాంధీ బీజేపీలో ఉన్నారు .మార్పు సహజం. అయితే కాపు ఓటు బ్యాంకు కొత్తపేటలో జగ్గిరెడ్డికి కాకుండా చేయాలి అని చేసిన ప్లాన్ అనేది కొందరు చెబుతున్న మాట.
సుమారు 15 వేల ఓట్లు కాపులవి జనసేనకు మరిల్చేలా చేయాలి అని భావించారు.. కాని జగ్గిరెడ్డి చరిష్మా ముందు ఈ సోదరుల రాజకీయాలు నెగ్గలేవు అంటున్నారు.. అంతేకాదు వైసీపీ వేవ్స్ ఒక రకంగా సపోర్ట్ ఉంటే జగ్గిరెడ్డి బ్రాండ్ కూడా ఏర్పరచుకున్నారు కొత్తపేటలో.. ముఖ్యంగా యువతకు దగ్గర అయ్యారు, పీకే సర్వేల్లో సిట్టింగుల్లో భారీ మెజార్టీతో గెలిచే సెగ్మెంట్లో కొత్తపేట ముందు ఉంది అని సర్వే వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే చెబుతున్నారు పైగా జగన్ అధికారంలోకి వస్తే జగ్గిరెడ్డి ముందు నుంచి జగన్ కు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి మంచి పొజిషన్లో ఉంటారు అనేది ఇక్కడ నేతలు చెప్పేమాట. సో ఈసారి జనసేనకు తెలుగుదేశం పార్టీకి అసలు ఎడ్జ్ లేదు అని చెబుతున్నారు. ఈసారి పోలింగ్ చూసుకున్నా గతంలో కంటే ఈసారి మంచి పోలింగ్ జరిగింది, అన్నదమ్ములు వేరే పార్టీలో ఉన్నా, రాజకీయ ఎత్తులు ఒకటే అని , ఫైనల్ గా జగ్గిరెడ్డి పైనే టార్గెట్ అంటున్నారు.!! ఎవరెన్ని క్షేత్రస్ధాయిలో కుట్రలు చేసినా కొత్తపేట ఎన్నికల కురుక్షేత్రంలో జగ్గిరెడ్డిదే విజయం అని చెబుతున్నారు ఇక్కడ జనం.!!
విశ్లేషణ–వీజీ
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్