జ‌గ‌న్ కొత్త స్ట్రాట‌జీ 19 సెగ్మెంట్లకు అభ్య‌ర్దులు ఖ‌రారు.

Jagan's new strategy finalized the candidates for 19 segments-cinetollywood.com

ఉభ‌య గోదావ‌రి జిల్లాలు రాష్ట్ర రాజ‌కీయాల‌ని డిసైడ్ చేస్తాయి అంటారు, అదే సీఎం కుర్చీ ఎవ‌రికి అనేది తేల్చే రిజ‌ల్ట్ ఈ రెండు జిల్లాల్లో ఉంది అని, ఈ రెండు జిల్లాల ఫ‌లితాల ప్ర‌కారం ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో తెలుస్తుంది అంటారు.. అయితే గ‌త ఎన్నిక‌ల్లో కోస్తాలో గోదావ‌రి జిల్లాలు రెండు, తెలుగుదేశానికి 85 శాతం విజ‌యం ఇచ్చాయి అని చెప్ప‌వ‌చ్చు.. ఇటు కోన‌సీమ ముఖద్వారం నుంచి ప‌శ్చిమ‌గోదావ‌రి ఏలూరు వ‌ర‌కూ తెలుగుదేశం విజ‌యం సాధించింది.

 

 
రాజ‌కీయంగా తెలుగుదేశం విజ‌యం సాధించినా గ‌త ఎన్నిక‌ల్లో కాపు ఓట్లు మెజార్టీ వైసీపీ క‌న్నాతెలుగుదేశానికి ప్ల‌స్ అయ్యాయి.. అలాగే 19 సీట్ల‌లో 2014 ఎన్నిక‌ల్లో 5 వైసీపీ 14 తెలుగుదేశం గెలుచుకుంది… అయితే గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం క‌న్నా జ‌గ‌న్ కాపుల‌కు ఎక్కువ ప్ర‌యారీటి ఇచ్చారు, అలాగే సీట్ల‌ను కేటాయించారు.. కాని మెజార్టీ ఓటు బ్యాంకు ప‌వ‌న్ తెలుగుదేశం వైపు ఉండ‌టం మోదీ గాలీ వీచ‌డంతో తెలుగుదేశానికి ప్ల‌స్ అయ్యాయి, కాని ఇప్పుడు ప‌రిస్దితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది.

 

 
అలాగే గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం త‌ర‌పున గెలిచిన వారు ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపార్టీ వైపు మ‌ర‌లుతారో తెలియ‌నిస్దితి… జ‌గ‌న్ కూడా గ‌త ఎన్నిక‌ల్లో సీట్ల స‌ర్దుబాటు క్యాండెట్ ఎంపీక‌లో ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకోలేదు అని విమ‌ర్శ‌లు వినిపించాయి. ఇక ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అభ్య‌ర్దుల ఎంపిక‌పై తుదిక‌స‌ర‌త్తు చేసేశారు.. ఎవ‌రిని నిల‌బెట్టాలి అనేది ఆయ‌న ఫిక్స్ అయ్యారు అని వైసీపీ కోట‌రిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

 

 
కాకినాడ సిటీకి మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి ఫిక్స్ అని తెలుస్తోంది. ఇక పార్టీ త‌ర‌పున క‌ష్ట‌ప‌డుతున్న మ‌రో కోఆర్డినేట‌ర్ ముత్తా శ‌శిథ‌ర్ కు వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కీల‌క ప‌దవి ఇస్తాను అని జ‌గ‌న్  అన్నార‌ట‌.. ఇక కాకినాడ రూర‌ల్ కు జిల్లా అధ్య‌క్షుడు జ‌గన్ కు వెన్నంటి ఉండే  కీల‌క నాయ‌కుడిగా ఎదుగుతున్న మాజీ ఎమ్మెల్యే కుర‌సాల క‌న్న‌బాబు పేరు ఫైన‌ల్ అయింది అని తెలుస్తోంది..

 

 
ఇక ముమ్మిడివ‌రానికి  మాజీ ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్ పేరు ఫైన‌ల్ అయింది అని తెలుస్తోంది…ఇక రాజోలులో గొల్ల‌ప‌ల్లి సూర్యారావుకి ధీటుగా ఉండే నాయ‌కుడు మాజీ ఎమ్మెల్యే పేరు తెర‌పైకి వ‌స్తోంది. ఇక మ‌రోమీటింగ్ లో  ఈసీటు ఫైన‌ల్ కానుంది… రాజాన‌గ‌రం నుంచి జ‌క్కంపూడిరాజా నిల‌బ‌డే అవ‌కాశం ఫైన‌ల్ అని అంటున్నారు.. రామ‌చంద్రాపురానికి మాజీ జెడ్పీ చైర్మ‌న్ వైసీపీలో సొంతంగా  బ‌లంతో ఎదుగుతున్న చెల్లుబోయిన గోపాల కృష్ణ‌కు సీటు ఇచ్చే అవ‌కాశం ఉంది అని తెలుస్తోంది.

 

 
ఇక  అమ‌లాపురం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం  రూర‌ల్ – సిటీ నుంచి కొత్త వారికి అవ‌కాశం ఉంది అట‌….ప్ర‌త్తిపాటు పిఠాపురంలో కూడా కొత్త అభ్య‌ర్దులు తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉంది..  పెద్దాపురంలో ఇటు రాజ‌ప్ప‌కు ధీటుగా నాయ‌కుడి వేట‌లో వైసీపీ ఉంది అని ఇక్క‌డ కూడా బ‌ల‌మైన అభ్య‌ర్దిని జ‌గ‌న్ ఫైన‌ల్ చేశారట‌.

 

 
అన‌ప‌ర్తి – పి గ‌న్న‌వ‌రం సెగ్మెంట్ల పై  పీకే స‌ర్వే జ‌రిగింద‌ని నాయ‌కులు చర్చించుకుంటున్నారు.. ఇటు కొత్త‌పేట ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డికి మ‌ళ్లీ అధికారం ప‌క్కా అని జ‌గ‌న్ ఎప్పుడో తెలియ‌చేశార‌ట‌.. జిల్లాలో జ‌గ‌న్ కు మంచి స‌న్నిహితుడిగా ఉన్నారు ఆయ‌న‌.. ఇటు జిల్లాలో క‌న్న‌బాబు లెఫ్ట్ అయితే జ‌గ్గిరెడ్డి రైట్ హ్యాండ్ గా కొన‌సాగుతున్నారు..తూగో జిల్లాలో ఫిరాయింపుల ఎఫెక్ట్ ప‌డినా అధికార పార్టీ తాయిలాల‌కు ఆశ‌ప‌డి  పార్టీ మార‌కుండా ఉన్న చీర్ల జ‌గ్గిరెడ్డికి మ‌రింత ప్ర‌జా మ‌ద్ద‌తు పెరిగింది అని వైసీపీ రిపోర్టులు చెబుతున్నాయి.. తునిలో వైసీపీ బ‌ల‌మైన అభ్య‌ర్దిని నిల‌బెట్టాల‌ని ప్లాన్ వేస్తోంది. మండ‌పేట‌లో ఇంచార్జ్ కే సీటు అని చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇటు జ్యోతుల చంటిబాబు జ్యోతుల నెహ్రూకు జ‌గ్గంపేట‌లో  వార్ జ‌రుగుతుంది అని అంటున్నారు జిల్లా నాయ‌కులు… ఇక ఫిరాయింపు ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వ‌రి సెగ్మెంట్ కూడా కాస్త డైల‌మాలో ఉంది.. ఇటు తెలుగుదేశం అభ్య‌ర్ది త‌నకు సీటు వ‌స్తుంది అని ఆశ‌లు పెట్టుకున్నార‌ట, అయితే వంత‌ల‌కు బాబు సీటు ఇస్తే జంపింగ్ త‌ప్ప‌దు అని అంటున్నారు ఏజెన్సీ నాయ‌కులు. ఇక జిల్లాలో ఉన్న మూడు పార్ల‌మెంట్ కాకినాడ‌, అమ‌లాపురం,రాజ‌మ‌హేంద్ర‌వ‌రం లో కొత్త అభ్య‌ర్దులు ఎంపీలుగా నిల‌బ‌డ‌తారు అని తెలుస్తోంది.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.