Cinetollywood

చంద్రబాబు పై కమిషన్ జగన్ కీలక నిర్ణయం

Jagan's commission on Chandrababu is a key decision

ఇప్పుడు వైయస్ జగన్ కు అధికారం వచ్చింది, ఆయన పార్టీ తరపున నేతలు, ఆయన టికెట్ ఇచ్చిన వారిలో దాదాపు 85 శాతం మంది గెలిచారు. ఏపీలో ఆయనకు తిరుగులేదు, ఎక్కడా ఎవరూ అడ్డులేరు. సులువుగా ఆయన ప్రజలకు మంచి పాలన అందించవచ్చు .ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు ,ఆయన వెంట కేవలం 23 మంది మాత్రమే మిగిలారు .ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని పక్కనపెట్టారు. ఇప్పుడు ఆ పార్టీ ఎందుకు ఇలాంటి పరిస్దితికి వచ్చామా అని పోస్టుమార్టం చేసుకుంటోంది, అలాగే చంద్రబాబు కూడా ఇంతలా ఎన్నికల ముందు పదివేల రూపాయలు మహిళలకు ఇచ్చినా , తమని ఎందుకు నమ్మలేదు అని ఆలోచనలో ఉన్నారు. అయితే జనంలో మార్పు వచ్చింది అనేది ఈజీగా ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే తెలుస్తుంది.

అపూర్వ విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని ఏ మాత్రం చెదరకుండా పాలన చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత.. ఏపీముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. .కచ్చితంగా రాజధాని భూముల వ్యవహారం వదిలేది లేదు అని చెబుతున్నారు జగన్, తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇది తెలుగుదేశం నేతలకు పెద్ద షాక్ కలిగిస్తోంది.

ఏపీ రాజధాని అమరావతిని తనకు లాభసాటిగా మార్చుకున్న చంద్రబాబు తీరును ప్రపంచానికి చాటి చెప్పాలన్న తలంపులో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. బాబు తో తనకు ఎలాంటి గొడవలు లేవు, ఆయన చేసిన కుంభకోణాలు బయటపెడతాం, వాటిని బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా తన మీద ఉందన్న విషయాన్ని ఆయన చెప్పారు. ఇక అమరావతి అంటేనే ఇన్ సైడర్ ట్రేడింగ్ అని జగన్ ముందు నుంచి చెబుతున్నారు.

బాబు బినామీలు అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు అని, అవన్నీ ఉన్నాయి కాని రైతుల భూములు మాత్రం అడ్డంగా దోచుకున్నారు అని విమర్శించారు జగన్. కచ్చితంగా దీనిపై ఒక విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. భూసేకరణ విషయంలో ఏం జరిగిందన్నది చూడటంతో పాటు.. రివర్స్ టెండరింగ్ ప్రక్రియతో ఆర్నెల్లలో దేశానికి.. ప్రపంచానికి తామెంత పక్కాగా ఉంటామన్న విషయాన్ని చాటి చెబుతానంటూ జగన్ చెబుతున్న మాటల్ని చూస్తే బాబు పరిస్దితి ఎలా ఉంటుంది అనేది ఆయన మాటలతో తెలుస్తోంది.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.