
బాబాయ్ కు కొత్త పదవి ఆఫర్ చేసిన జగన్
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆయన కేబినెట్ కూడా సిద్దం అవుతోంది .. తెలుగుదేశం నేతలు వరుసగా నామినేటెడ్ పదవులకు గుడ్ బై చెబుతున్నారు.. రాజీనామాను సీఎస్ కు పంపుతున్నారు.. అయితే ఇక వైసీపీలో ఆశావాహులు ఈ పదవులు తమకు వస్తాయి అని లైన్ లో ఉన్నారు.. జగన్ మదిలో ఏముంది పార్టీ తరపున జగన్ కు వెన్నంటి ఉన్న నేతలకు జగన్ ఇప్పటికే ఆ పదవులు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారట.. ఇక ఈ సమయంలో అందరూ చర్చించుకుంటున్న పదవి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రద్దు చేయడానికి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయడానికి సుధాకర్ యాదవ్ సుముఖత చూపకపోవడంతో ఈనిర్ణయం తీసుకోవడానికి జగన్ సిద్దం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా పాలకమండలిని రద్దు చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం టీటీడీ బోర్డునే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడిన ఆలయాల పాలక మండళ్లన్నింటినీ రద్దు చేయడానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందట ఇది త్వరలోనే చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రద్దు కానున్నాయి అని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ చైర్మన్ పదవి కోసం ఇప్పటి వరకూ మంచు మోహన్ బాబు పేరు తెరపైకి వచ్చింది.. కాని ఇప్పుడు మరో వ్యక్తి పేరు తెరపైకి వస్తోంది. ఇక తాజాగా వారం నుంచి భూమన కరుణాకర్ రెడ్డిపేరు వినిపించింది. అయితే ఆయన గతంలో కూడా చైర్మన్ గా వైయస్ హయాంలో పనిచేశారు.. పైగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందుకే మరొకరికి కొత్తగా అవకాశం ఇవ్వాలి అని జగన్ ఆలోచన చేస్తున్నారు. ఇందులో ప్రముఖంగా జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిపేరు వినిపిస్తుంది. ఆయన కూడా ఈ పదవి ఇస్తే తీసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. ఎలాగో ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తాను అన్నారు జగన్, కాని అంతకంటే స్వామి సేవే తనకు ఇష్టం అని చెబుతున్నారట వైవీ సుబ్బారెడ్డి. మరి వైవీసుబ్బారెడ్డి, మంచు మోహన్ బాబు, రాజంపేట సీటు ఆశించిన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వీరి ముగ్గురిలో ఈ పదవి ఎవరికి వరిస్తుందో చూడాలి.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్