Cinetollywood

బాబు కంచుకోట‌లో గెలుపు దిశ‌గా జ‌గ‌న్

Jagan-cinetollywood.com

కృష్ణా జిల్లా తెలుగుదేశానికి కంచుకోట‌గా చెబుతారు తెలుగుత‌మ్ముళ్లు …అన్ని సెగ్మెంట్ల‌లో త‌మ సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉండ‌టం దీనికి ప్ర‌ధాన కారణం అంటారు… అయితే వైయ‌స్ సీఎంగా అధికారంలో ఉన్న స‌మయంలో, ఇక్క‌డ కాంగ్రెస్ అధికారంలొకి వ‌చ్చిన స‌మ‌యంలో, ఇక్క‌డ డ‌బ్బు డామినేష‌న్ చేసింది అనే కామెంట్లు చేసింది తెలుగుదేశం.. అయితే తెలుగుదేశం కామెంట్లను ఎప్పూడూ ఇటు కృష్ణా జిల్లా కాంగ్రెస్ నాయ‌కులు ప‌ట్టించుకోరు..

 

 
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఓట‌రు నిర్ణ‌యం మారింది, రాష్ట్రాన్ని విడ‌దీసిన కాంగ్రెస్ పార్టీని తుంగ‌లోకి తొక్కారు ప్ర‌జ‌లు, దీంతో బుగ్గ‌కారులో తిరిగిన కాంగ్రెస్ నాయ‌కులు నేడు అంబాసిడ‌ర్ల‌కు త‌మ ఇళ్ల‌కు ప‌రిమిత‌మ‌య్యారు.. అలాగే కొంద‌రు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి సామాజిక  రాజ‌కీయ లెక్క‌లు వేసుకుని సీట్లు సంపాదించి పార్టీలో వెలుగువెలుగుతున్న నాయ‌క‌త్వం కూడా ఉంది.

 

 
16 సెగ్మెంట్లు ఈ జిల్లాలో ఉంటే కేవ‌లం ఐదు సీట్లు వైసీపీ గెలుచుకుంది, 2014 ఎన్నిక‌ల్లో… ఇక  11 సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది… మెజార్టీ నాయ‌కుల‌ను  గెలుచుకున్న తెలుగుదేశం ఆక‌లి తీర‌లేదు, వెంట‌నే పార్టీ ఫిరాయింపుల‌కు ఆజ్యం పోసింది.. మొద‌టి వికెట్ ఎవ‌రా అని అనుకుంటున్న సమ‌యంలో చాలా మందికి గాలం వేసి బీకాంతో ఫేమ‌స్ అయిన విజ‌య‌వాడ వెస్ట్ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ ను పార్టీలోకి తీసుకున్నారు తెలుగుదేశం నాయ‌కులు.

 

 
అయితే ఆయ‌న లెక్క‌లు అన్ని ఆలోచించి ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది అనుకుంటే, ఆయ‌న డ్రీమ్ ను మ‌రో డ్రీమ్ ఛాన‌ల్  ఖూనీ చేసేసింది… ఇక పామ‌ర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న కూడా పార్టీమారి తెలుగుదేశం కండువా క‌ప్పుకున్నారు, అక్కడ సెగ్మెంట్లో వ‌ర్గ‌పోరు ఆకాశానికి తాకింది అనేది తెలిసిందే.

 

 
ఇక వైసీపీ లో  కె. రక్షణ నిధి తిరువూరు ఎమ్మెల్యే,  అలాగే మేకా ప్రతాప్ అప్పారావు నూజివీడు ఎమ్మెల్యే ,  అలాగే కొడాలి నాని గుడివాడ  ఎమ్మెల్యే కొన‌సాగుతున్నారు… ఇటు కొడాలి నానికి చెక్ పెట్టేందుకు ఆయ‌న అనుచ‌రుడ్ని తెలుగుదేశంలోకి తీసుకున్నారు  మంత్రులు…అయితే నాని అనుచ‌రుడు ర‌వికాంత్ 48  గంట‌లు గ‌డ‌వ‌క ముందే తెలుగుదేశం బండారం తెలుసుకుని వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

 

 
దీంతో తెలుగుదేశం కంగుతింది, చేర్చుకున్న మంత్రుల‌కు కూడా బాబు అక్షింత‌లు వేశారు.. దీంతో ఇటువంటి సెకండ‌రీ ప‌నులు చేయ‌వ‌ద్ద‌ని ఆదేశాలు కూడా వ‌చ్చాయి.. దీనికి ముందే  గుడివాడ‌లో 9 వ వార్డు కౌన్సిల‌ర్ మున్సిపల్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలోకి చేరారు..

 
అలాగే ఆయ‌న‌తో పాటు వైసీపీ కౌన్సిల‌ర్లు ప‌ది మందిని పార్టీలో చేర్చుకున్నారు..మొత్తం 36 వార్డులుఉంటే అందులో  2014 ఎన్నికల్లో వైసీపీ 21 గెలుచుకోగా.. 15 మంది టీడీపీ తరపున గెలిచారు ఇక 2016 లో వీరి చేరిక‌తో అక్కడ నానికి మైలేజ్ మైనస్ చేయాలి అని అనుకున్నారు కాని అక్క‌డ కౌన్సిల్ త‌ర‌పున ప్ర‌జ‌లు వీరి ఫిరాయింపుల‌ను హ‌ర్షించ‌లేదు.. ఇక్క‌డ కృష్ణా జిల్లాలో అనేక అనేక స‌మ‌స్య‌ల్లో తెలుగుదేశం ఇరుక్కుంది.

 

 
బాబుకు వెన్నంటి ఉండే ఎమ్మెల్యే బోండా ఉమా కూడా భూ అక్ర‌మ‌ణ‌ల్లో ఇరుక్కోవ‌డం, అనేక ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డం. దేవినేని ఉమా మంత్రిగా ఉండి ఆయ‌న అనుచ‌రులు ఓ వైశ్య వ్యాపారిని చెదిరించ‌డం, అక్ర‌మ‌ణ‌లు, భూ దందాలు తెర‌పైకి రావ‌డం, కృష్ణా పుష్క‌రాల్లో అక్ర‌మాలు జ‌రిగాయి అని ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేస్తూనే ఉంది ఇటు వైసీపీ.

 

 
ఇటు  క‌ర‌క‌ట్ట ఆక్ర‌మ‌ణ‌లు, అలాగే విజ‌య‌వాడ‌లో తెలుగుదేశం నాయ‌కులు చేస్తున్న రియ‌ల్ భూమ్ పై ప్ర‌జ‌లు తిర‌గ‌బడుతున్నారు… ఇక కృష్ణాలో కూడా అగ్రిగోల్డ్ బాధితులు త‌మ గోడు వెల్ల‌బోసుకోవ‌డం, రాజ‌ధానికి లింక్ అయిన ప్రాంతంలో తెలుగుదేశం నాయకులు భూదందాల‌కు పాల్ప‌డటం ఇవ‌న్ని తెలుగుదేశానికి అత్యంత స‌మ‌స్య‌లుగా క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్ని తెలుగుదేశానికి మైన‌స్ గా క‌నిపిస్తున్నాయి..

 

 
పార్టీ ఫిరాయింపుల ఎఫెక్ట్ కూడా జిల్లాలో పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది… ఇటు తిరువూరు ఎమ్మెల్యే, ర‌క్ష‌ణ‌ నిధి తెలుగుదేశం ప్రలోభాల గురించి చెప్ప‌డం నిధులు కేటాయించ‌కుండా తెలుగుదేశం స‌ర్కారు చేస్తున్న ప‌నిపై ఆయ‌న విమర్శ‌లు చేయ‌డం… ఇదంతా కుట్ర‌పూరితంగా చేస్తున్న ప‌ని అని తెలుగుదేశం పై ప్ర‌జ‌ల్లో వైసీపీ స‌క్సెస్ ఫుల్ గా తీసుకువెళుతోంది… టీడీపీ పై తిరుగుబాటు పెరుగుతోంది  ప్ర‌జ‌ల త‌ర‌పునుండి.. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర ఈ ఫిరాయింపు సెగ్మెంట్ల‌లో ఉండేలా ఉంది..

 

 
అలాగే ఇటు జ‌లీల్ ఖాన్ కు నెక్ట్స్ టికెట్ ఇచ్చే అవ‌కాశం లేదు అని తెలుగుదేశం నాయ‌కులే అనుకుంటున్నారు.. ప్ర‌పంచ‌కంలో బాబుగారు చేసే అభివృద్ది అంద‌రికి తెలుసు అని చెబుతున్న నాయ‌కులు తెలుగుదేశం ఎమ్మెల్యేల పై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌పై ఎందుకు నోరు మెద‌ప‌డం లేదు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

 

 
సో జ‌గ‌న్ పాద‌యాత్ర బాబు రెండ‌వ కంచుకోట‌ను నిలువుగా కూల్చ‌నుంది అని తెలుస్తోంది వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇంకాస్త క‌ష్ట‌ప‌డితే ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్దుల విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కే అంటున్నారు విశ్లేష‌కులు.

విశ్లేష‌ణ  ! వీజీ

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.