
జగన్ గేమ్ స్టార్ట్ -జూన్ 8న మంత్రి వర్గం రేసులో వీరే
ఏపీలో నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని సమీకరణాలు చూసుకుని మంత్రి వర్గ కూర్పు చేయాలి అని భావిస్తున్నారు.. అంతేకాదు పార్టీలో అలక రాకూడదు అని ఉద్దేశంలో ఉన్నారు జగన్.. ముఖ్యంగా పార్టీలో తనకు ఇప్పటి వరకూ సాయంగా ఉన్న వారికి మంత్రి పదవులు ఇవ్వడం, అలాగే గెలుపులో కీ రోల్ పోషించిన వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వాలి అని భావించారు. ఇక సీనియర్లకు కచ్చితంగా కీలక శాఖలు ఇవ్వాలి అని జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఇక ఆయన జూన్ 8 మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇక వెంటనే గంట వ్యవధిలోనే కేబినెట్ భేటీ ఉంటుంది అని తెలుస్తోంది. వారిచే మొదటి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు జగన్ . అలాగే అదే రోజున ఉ.8.39గంటలకు జగన్ ఏపీ సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. కాగా మరోవైపు జగన్ కేబినెట్లో స్థానం దక్కించుకునేందుకు పలువురు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా సీనియర్లు అలాగే సామాజిక సమీకరణాల పరంగా చూస్తే కేబినెట్ రేసులో ? జగన్ టీం లో ఎవరు ఉంటారు అనేది ఓసారి ఆశావాహులు బట్టీ సీనియర్ల బట్టీ చూద్దాం.
ఉత్తరాంధ్రా నుంచి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ముత్యాలనాయుడు
తూర్పుగోదావరి జిల్లా నుంచి , పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్
పశ్చిమగోదావరి నుంచి గ్రంథి శ్రీనివాస్, ప్రసాదరాజు
కృష్ణాజిల్లా నుంచి కొడాలి నాని, పేర్ని నాని
రాజధాని గుంటూరు జిల్లానుంది, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సుచరిత,
ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి,
నెల్లూరు నుంచి మేకపాటి గౌతమ్,
చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కడప నుంచి , అంజాద్ బాషా,
కర్నూలు నుంచి బుగ్గన రాజేంథ్రనాథ్
అనంతపురం నుంచి అనంత వెంకటరామిరెడ్డి పేర్లు ఇప్పటి వరకూ ఫైనల్ అయ్యాయి అని తెలుస్తోంది, నగరి నుంచి రోజాకు మంత్రి పదవి ఫిక్స్ అని, కాని స్పీకర్ గా కూడా ఆమె పేరును పరిశీలిస్తున్నారట జగన్.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్