Cinetollywood

జాను రివ్యూ

Jaanu Movie REVIEW

సమర్పణ: శ్రీమతి అనిత
బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
నటీనటులు: శర్వానంద్, సమంత, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, రఘుబాబు, తాగుబోతు రమేశ్, శరణ్య, గౌరి, సాయికిరణ్, హాసిని తదితరులు
మాటలు: మిర్చి కిరణ్
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, శ్రీమణి
ఆర్ట్: రామాంజనేయులు
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజ్
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాతలు: దిల్రాజు, శిరీష్
దర్శకత్వం: సి.ప్రేమ్కుమార్

!!ఇంట్రో !!
తెలుగులో కూడా ఇప్పుడు అనువాద చిత్రాలు బాగా వస్తున్నాయి.. అలాగే తెలుగు చిత్రాలు వేరే భాషల్లో అనువాదం అవుతున్నాయి.. ఇలాంటి చిత్రాలు కథలోని ఆత్మను, నెటివిటీని దృష్టిలో పెట్టుకుని అనువాదం చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే అనువాద సినిమా ప్రేక్షకాదరణను పొందదు. గత ఏడాది వచ్చిన 96 మూవీ క్లాసిక్ హిట్ అయింది తమిళ్ లో, ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

17 ఏళ్ల కెరీర్లో దిల్రాజు చేస్తున్న తొలి రీమేక్ సినిమా ఇది. విజయ్ సేతుపతి, త్రిష హీరో హీరోయిన్లుగా తమిళంలో రూపొందిన 96 ను తెలుగులో శర్వానంద్, సమంత అక్కినేనిలతో జానుగా రీమేక్ చేశారు. అయితే అక్కడ సక్సెస్ అయిన ఈ సినిమా తెలుగు వెండితెరపై ఎలా ఉంది అనేది చూద్దాం.

!!కథ!!
కె.రామచంద్ర(శర్వానంద్) ట్రావెల్ ఫొటోగ్రాఫర్గా పనిచేస్తుంటాడు. ఓ పని కోసం తన స్టూడెంట్తో వైజాగ్ వచ్చిన రామచంద్ర అక్కడ స్కూల్, థియేటర్ను చూడగానే తన గత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. అప్పుడు తనతో పాటు 10వ తరగతి చదువుకున్న మురళి (వెన్నెలకిషోర్), సతీష్ (తాగుబోతు రమేశ్)లకు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఆ క్రమంలో అందరూ హైదరాబాద్లో రీ యూనియన్ కావాలనుకుంటారు. అన్నట్లుగానే అందరూ కలుసుకుంటారు. అప్పుడు రామచంద్ర, జానకి దేవి (సమంత అక్కినేని)ని కలుసుకుంటాడు. దాదాపు 17 సంవత్సరాలు తర్వాత కలుసుకున్న ఇద్దరూ రీ యూనియన్ పార్టీ తర్వాత జానకితో కలిసి రామచంద్ర ఆమె ఉండే హోటల్కి వెళతాడు. అప్పుడు ఇద్దరూ 10వ తరగతి చదువుకునేటప్పుడు ఇద్దరి మధ్య పరిచయం, ఎలా విడిపోయాం అనే సంగతులను గుర్తుకు తెచ్చుకుంటారు.

జానుకి పెళ్లై ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. అసలు రామచంద్ర ఎందుకు పెళ్లి చేసుకోడు? రామచంద్ర, జాను ఎందుకు విడిపోతారు? అసలేం జరిగింది? చివరికి ఇద్దరి ప్రయాణం ఎలా ముగిసింది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

!!విశ్లేషణ!!

రీమేక్ చిత్రాలు తీయాలి అంటే సేమ్ నేటివిటీ కథ ఉన్నా అక్కడక్కడా మార్పు చేస్తూ ఉంటారు…క్లాసిక్ మూవీలను రీమేక్ చేయడం కత్తిమీద సామే.. అది ఏ భాషలోనైనా అంతే. అలాంటి ప్రయత్నమే జాను. 96 సినిమాకి ఇది తెలుగు రీమేక్. సినిమా ప్రధానంగా రెండు పాత్రల మధ్యనే సాగుతుంది. విజయ్సేతుపతి, త్రిష పాత్రలను శర్వానంద్, సమంతలు క్యారీ చేశారు. అక్కడ వెండితెరపై వెలిగినట్లే ఇక్కడ పాత్రలు వెలిగాయి అనే చెప్పాలి

రామ్ పాత్రలో శర్వా.. జానకి పాత్రలో సమంత ఒదిగిపోయారు. సమంత శర్వా ఎక్కడా బేస్ తగ్గకుండా అదే క్యారీ చేశారు, వారి ప్రేమ ఎందుకు విడిపోయింది చిన్ననాటి గుర్తులు ఇలా కథలో అన్నీ పాళ్లు మిక్స్ అయ్యాయి.ఇక వెన్నెలకిషోర్, తాగుబోతు రమేష్, తనికెళ్ల భరణి, రఘుబాబుతో పాటు జూనియర్ శర్వానంద్గా నటించిన సాయికిరణ్, జూనియర్ సమంతగా నటించిన గౌరి చక్కగా నటించారు. లవ్ సీన్స్ బ్రేకప్స్ సినిమా ఎమోషన్స్ బాగా క్యారీ చేశాయి.

డైరెక్టర్ ప్రేమ్కుమార్ సినిమాను బాగా తెరకెక్కించారు, అలాగే ఈ ఫీల్ గుడ్ మూవీకి మహేంద్రన్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఇక దర్శకుడు చెప్పాలనుకుంది లవ్స్టోరీ. దానికి సంగీతమే ప్రధాన బలం కావాలి. గోవింద్ వసంత సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరో రేంజ్లో నిలిపాయి. సినిమా చాలా సాఫ్ట్ గా వెళుతుంది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

!!ప్లస్ పాయింట్స్!!
సంగీతం
సమంత, శర్వానంద్

!!బోటమ్ లైన్!! ఒక సాఫ్ట్ అండ్ ఎమోషనల్ లవ్ ట్రాక్

(రేటింగ్ 3-5)

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.