భీమవరం ఎన్నికల బరిలో పవన్ కల్యాణ్ రీజన్ ఇదే

Is the Pawan Kalyan reason in the election of Bhimavaram

తెలుగుదేశం వైసీపీలు అసలు పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అని అనుకున్నారు.. చివరకు పవన్ కల్యాణ్ గాజువాక అలాగే భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు అని తెలియడంతో, గాజువాక సరే భీమవరం ఎందుచుకోవడం వెనుక రీజన్ ఏమిటి అనే ఆలోచన చేస్తున్నారు. తన సొంత జిల్లాగా పశ్చిమగోదావరి జిల్లాని చెబుతారు మెగా ఫ్యామిలీ, అత్తగారిల్లు అమ్మగారిల్లు కూడా గోదావరి జిల్లాలే ఈ మెగా బ్రదర్స్ కి ..ఈ మమకారం కూడా ఉంది ముగ్గురు హీరోలకి. నరసాపురం సొంత గడ్డ, అయితే పాలకొల్లు నరసాపురం భీమవరం మూడు సెగ్మెంట్లలో ఏమీ చూసుకున్నా ఆయన చరిష్మా బాగానే ఉంటుంది అనేది సర్వే ఫలితం.

ముఖ్యంగా ఆయన ఇక్కడ పర్యటించిన సమయంలో ఇక్కడ భీమవరం సమస్యలు నేరుగా చూశారు, భీమవరం డంపింగ్ యార్డు స్వయంగా చూశా. ఏళ్ల తరబడి విన్నవించుకున్న అక్కడి వారికి ఫలితంలేదు. నాయకులంతా అభివృద్ధి చెందారే తప్ప.. పట్టణం మాత్రం అలాగే ఉంది.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ యనమదుర్రు డ్రెయిన్. ప్రక్షాళన చేస్తామన్నారు కాని.. ఇప్పటికి అది పూర్తికాలేదు. నిర్లక్ష్యానికి నిలువుటద్దమది. రాజకీయ ప్రక్షాళన చేసే పనిని.. భీమవరం నుంచే మొదలుపెడదాం…’ అని పవన్ చెప్పినట్లు తెలిసింది. మొత్తానికి భీమవరం పై ఓ ఫోకస్ పెట్టిన పవన్ కల్యాణ్ , ఇక్కడ ప్రజలు తనకు గెలుపు ఇస్తారు అనే నమ్మకంతో ఈ ప్లేస్ ను సెలక్ట్ చేసుకున్నారట

ముఖ్యంగా జిల్లాలో భీమవరంలో రాజకీయ చైతన్యం స్పష్టంగా ఉండడం, రాష్ట్రంలోనే పేరొందిన పట్టణం కావడం, తన సొంత జిల్లాలో అన్ని వర్గాలతో కూడిన ప్రాంతం కావడం, అభివృద్ధి చెంది ఉండడం, ఆర్ధిక, సామాజిక వర్గాల్లో ఎవరికెవరూ తీసిపోకుండా ఉండడం పవన్ను ఆకర్షించినట్టు చెబుతున్నారు. ఇవన్నీ ఆలోచించి పవన్ కల్యాణ్ భీమవరం సెలక్ట్ చేసుకున్నారు, పది సెగ్మెంట్లలో సర్వే చేసిన టీం భీమవరం టాప్ 3 లో పవన్ కు మద్దతు ఉంది అని తెలియచేసింది. అందుకే పవన్ భీమవరం సెలక్ట్ చేసుకున్నారు,ఇది రాజులు కాపుల కోటగా చెబుతారు మరి ఇక్కడ ఇద్దరి సపోర్ట్ ఉంటే గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ భీమవరం డీఎన్ ఆర్ కాలేజీలోనే పవన్ కల్యాణ్ పరీక్షలు రాసేశారు.
ఇక పవన్ ఇక్కడ ప్రచారం చేసేందుకు సిద్దం అవుతున్నారు..ఈనెల 22న పవన్ నామినేషన్కు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయం త్రం 5 గంటల మధ్య రిటర్నింగ్ అధికారికి పవన్ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. సో వార్ ఇక్కడ రసవత్తరంగా మారే అవకాశం ఉంది అని తెలుస్తోంది వైసీపీ, జనసేన, తెలుగుదేశం మధ్య.

విశ్లేషణ. గణేష్ .వి

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.