10 లక్షల పాన్ కార్డులు డీయాక్టివేట్‌…మీ కార్డు ఉందొ లేదో చూసుకోండి ఇలా

income tax deactivated 10 lacs pancards

పాన్‌కార్డు హోల్డర్స్‌కు కేం‍ద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.దేశ వాప్తంగా సుమారు 10 లక్షల పాన్ కార్డులను డీయాక్టివేట్ చేసింది.అక్రమాల నియంత్రణ దిశగా వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసింది కేంద్ర ప్రభుత్వం.ఇప్పటికే పాన్ కార్డ్,బ్యాంక్‌ ఖాతాలు మరియు మొబైల్ నెంబర్ కు ఆధార్ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం ఆగష్టు నెలాఖరులోగా ఆధార్ ను అనుసంధానం చేయాలనీ సూచించిన విషయం అందరికి తెలిసిందే.ఆగష్టులోపు ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.డీయాక్టివ్‌ మరియు తొలగించబడిన పాన్‌కార్డుల్లో మీకార్డు ఉందో లేదో తెలుసుకోవాలంటే ఐటీ డిపార్ట్ మెంట్ ఇ- ఫిల్లింగ్ వెబ్ సైట్‌ని సందర్శించండి. అందులో ‘Know Your Pan’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్‌ చేస్తే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నక్షత్రం గుర్తు ఉన్న ఖాళీలు అన్నీ జగ్రత్తగా నింపి సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నెంబర్ కి వన్ టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి వాలిడేట్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ పాన్ కనుక డీ యాక్టివేట్ కాకపోయి ఉంటే ‘యాక్టివ్’ అని కనిపిస్తుంది.ఈ వెబ్ సైట్ నుంచి మీ ఆధార్ ను లింక్ చేసుకునే సదుపాయం కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం.ఈ నెల 31వ తేదీలోపు ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులు చెల్లవని ఆర్థికమంత్రిత్వ శాఖ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది.అంతేకాకుండా ఆగస్టు 31వ తేదీలోపు ఆధార్‌నెంబర్‌తో లింక్‌ చేయని పాన్ కార్డ్స్ కు ఐట రిటర్న్స్‌ కూడా చెల్లవని స్పష్టం చేసింది.మీరు పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే తప్పకుండ చేయండి. మరిన్ని ఇంటరెస్టింగ్ న్యూస్ కోసం చుస్తూ ఉండండి www.cinetollywood.com.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.