ఇక్కడ వైసీపీకి జనసేనకు టఫ్ వార్ టీడీపీ అవుట్

In Tenali tough war between YSRCP and Janasena

వైసీపీ జనసేన తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లాలో మరింత టఫ్ ఫైట్ ఉండే సెగ్మెంట్ ఇదే అని చెప్పాలి….అదే తెనాలి.. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు… ఇటీవల వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యం అని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ఇక వైసీపీ తరపున జగన్ కు నమ్మన వ్యక్తిగా అన్నాబత్తుని శివ కుమార్ ఇంచార్జ్ గా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు.. ఇక జనసేన తరుపున జనసేన నెంబర్ 2 అంటే పవన్ తర్వాత కీలక నాయకుడిగా ఉన్న, నాదెండ్ల మనోహర్ ఉన్నారు.

ఇక ఇటీవల పవన్ తెనాలి నుంచి ఆయన పేరుని ప్రకటించారు.. అయితే వీరిలో ఇక్కడెవరికి గెలుపు వస్తుంది అనే విషయంలో ముగ్గురు ధీటుగా ప్రచారాలు చేస్తున్నారు… పార్టీ తరపున కొత్త ఊపు తీసుకువస్తున్నారు..అయితే తెలుగుదేశం అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్కే ఈ స్థానం ఖరారు చేశారని నిన్నటి వరకు ప్రచారంలో ఉంది, కాని తాజాగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆలపాటిని గుంటూరు పశ్చిమకు మారుస్తారు అని సొంత పార్టీ నేతలు అంటున్నారు.

అలాగే వైసీపీలో గత రెండు నెలల క్రితం ఇక్కడ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తారు అని వార్తలు వినిపించాయి..కాని జగన్ మాత్రం గత ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్ ఓటమితో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు అని ఆలోచించి ఆయనకే టికెట్ అని చెప్పారట. అయితే ఇక్కడ ఇటీవల పార్టీ సీనియర్లు మీటింగులో కూడా ఇదే చర్చించారట వైసీపీ జనసేన మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది అన్నారట.. సిట్టింగ్ ఎమ్మెల్యే నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు కాని, రాజకీయంగా టఫ్ గా ఉండేది మాత్రం నాదెండ్ల మనోహర్ మాత్రమే అని అంటున్నారు ఇక్కడ జనం. ఇక్కడ వైసీపీకి జనసేనకు పోటీ అంతేకాని టీడీపీకి ఈరెండు పార్టీలకు కాదు అని ఇక్కడ జనం చెబుతున్నారు.

.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.