
నేను చెప్పాను నువ్వు వినలేదు బాబుకు రామోజీ క్లాస్
నేను చెప్పానా నేను చెప్పానా నువ్వు వినలేదు ఇది సినిమా డైలాగ్, కాని ఇప్పుడు రామోజీరావు చంద్రబాబు మధ్య ఇదే విషయం చర్చకు వస్తుంది.. రాజగురువు ఏం చెబితే అది చేసేవారు చంద్రబాబు.. కాని తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన తర్వాత కేసీఆర్ రామోజీ సయోధ్య బాగా కుదిరింది. బాబు రాజకీయం ఏదో అవసరానికి మాత్రమే జరుగుతోంది. అయితే బాబుకి మాత్రం రామోజీరావు అవసరం ఎంతైనా ఉంది. మరోసారి అధికారంలోకి వస్తే ఫిల్మ్ సిటీ 2 అమరావతిలో కూడా నిర్మించేవారు ఏమో అనేలా చర్చ జరిగింది. కాని అది కలగానే మిగిలింది. బాబుకు రాజకీయంగా ఎంత టెన్షన్ ఉన్నా రామోజీ గురువుతో మాట్లాడితే చాలు ప్రాబ్లం తీరుతుంది అని భావిస్తారు.
నిజమే ఏపీలో కాదు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక బిగ్ పర్సెన్ అని చెప్పాలి రామోజీని, ఇటు రాజకీయాల్లో వ్యాపార వర్గంలో రామోజీరావుకు చాలా పేరు ఉంది. అక్కడ కాంగ్రెస్ కు వ్యతిరేకిగా రామోజీ రావు ముందు నుంచి ముద్ర వేసుకున్నారు. ఇది ఆరెస్సెస్ వాదుల నుంచి బీజేపీ నేతల వరకూ అందరికి తెలిసిన సత్యం.
ఇటు మోదీ నుంచి అక్కడ బీజేపీలో పెద్దలు అందరితో కూడా రామోజీకి మంచి సంబంధాలు ఉన్నాయి.. వెంకయ్య తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ కు పూర్తి వ్యతిరేకి రామోజీ అనేది మనకు కూడా తెలిసిందే… బాబుకు కూడా ఎలాంటి ఇబ్బంది బీజేపీతో వచ్చినా రామోజీరావు తీరుస్తారు అని భరోసా కూడా ఉంది. బాబుకు ఎన్నికల ముందు రామోజీ చెప్పింది ఒకటి, బాబు చేసింది ఒకటి. 2014 నుంచి బాగానే ఉన్నా, 2018 నుంచి బీజేపీకి బాబుకి మధ్య ఎలాంటి వివాదాలు వచ్చాయో తెలిసిందే.
ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత, వారం రోజులు అమరావతి తర్వాత హైదరాబాద్ తర్వాత విదేశాలు ఇలా బాబు ప్లాన్స్ బిజీ టూర్లతో ఉన్నారు. ఇదంతా బాబుకు ఓటమితో వచ్చిన బాధ, అయితే ఇలాంటి పరిస్దితి బాబుకు రావడంతో రామోజీరావు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. తాను చెప్పిన విధంగా నువ్వు విని ఉంటే పరిస్దితి ఇలా ఉండేది కాదు అని రామోజీరావు అన్నారట. ఫలితాలకు ముందు రామోజీ ఇంటికి చంద్రబాబు వచ్చారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. బీజేపీకి భారీ మెజార్టీ రానుంది అని ఆయన తెలియచేశారట. ముందు నుంచి తాను చెబుతున్నాను, మరోసారి బీజేపీకి వేవ్స్ బలంగా ఉన్నాయి. మీరు బీజేపీపై పోరాటం చేయవద్దు అని చెప్పాను, కాని మీరు మాత్రం వినలేదు, బీజేపీ అధికారంలోకి రాదు అని భావించారు. ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందింది వేరు. మాకు తెలిసింది వేరు అని చెప్పారట. ఇక బాబుపై ఉన్న కేసులు అన్నీస్టేలతో గేట్ దగ్గర ఆగిపోయాయి, ఆ కేసులు బయటకు వస్తే బాబు జైలుకి వెళ్లడం ఖాయం అని అంటున్నారు. ఈ సమయంలో కేంద్రం కొరడా ఝులిపిస్తే బాబుకు కష్టం అని రాజకీయ వర్గాల్లో ప్రచారం కూడా ఉంది.
అందుకే బాబు మోదీతో సయోధ్యగా ఉండి ఉంటే పరిస్దితి బాగుండేది అని, ఈ విషయంలో జగన్ తెలివిగా వ్యవహరించాడు, ప్రజలకు బాగా అర్దం అయింది అని అన్నారట.. కాని మీరు బోన్ లో చిక్కుకున్నారు అని అన్నారట రామోజీ, ఇక గత నెల మే 15న జరిగిన విందుభేటీలో ఇదే సూచించారని సమాచారం, కాని బాబు మాత్రం వినలేదు. ముఖ్యంగా బాబు ఇప్పటికే యూటర్న్ అనేపేరు తెచ్చుకున్నారు, అప్పటి వరకూ మోదీని తిట్టిన బాబు మళ్లీ మోదీకి దగ్గర అయితే పరిస్దితి మారుతుంది, ప్రజలు మరింత ఛీకొడతారు అని భావించారు .. చివరకు రెండింటికి దూరం అయ్యారు, ఇక ఎవరి చేతుల్లో ఏమీ లేదు అంతా మోదీ దయ అని చెప్పుకుంటున్నారు నేతలు.
Gallery
Latest Updates
-
డై హార్డ్ ఫ్యాన్ తెలుగు సినిమా రివ్యూ
-
హీరో అభయ సింహ కమిట్మెంట్ మూవీ
-
మాటరాని మౌనమీది మూవీ రివ్యూ
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్