Cinetollywood

హలో గురు ప్రేమ కోసమే రివ్యూ

Hello guru prema kosame movie review

నటీనటులు: రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌, ప్రణీత, ప్రకాష్‌రాజ్‌, మహేష్‌, సితార, వి.జయప్రకాష్‌, పోసాని కృష్ణమురళి, సత్య తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి చక్రవర్తి
ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌
నిర్మాత: శిరీష్‌, లక్ష్మణ్‌
సమర్పణ: దిల్‌రాజు
దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌

!!ఇంట్రో!!

ల‌వ‌ర్ బాయ్స్ గా హీరోలు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు.. అందులో రామ్ కూడా ఒక‌డు.. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో సినిమా ద‌ర్శ‌కుడు వ‌చ్చి క‌ధ చెబితే చేయ‌డానికి సాహ‌సంగా వ‌చ్చే హీరోగా రామ్ అని చెప్పాలి.. కాస్త ఎంట‌ర్ టైన్ మెంట్ ఉండాలి, యాక్ష‌న్ ఎలిమెంట్ ఉండాలి. ఇది ఇప్పుడు ఏ హీరో అయినా ద‌ర్శ‌కుడు క‌థ చెబుతుంటే చెప్పేమాట. ఇక రామ్ కూడా అంతే త‌న సినిమాల సెల‌క్ష‌న్ అలాగే చేసుకుంటున్నాడు. దర్శకుడు త్రినాథరావు నక్కిన తో రామ్ చేసిన సినిమా మ‌న ముందుకు వ‌చ్చింది…ఇక నిర్మాత‌గా దిల్‌రాజు హలో గురు ప్రేమ కోసమేతో దసరా కానుకగా వెండితెర‌పై సినిమాని ప్ర‌ద‌ర్శించారు మ‌రి ఎలా ఉందో చూద్దాం.

!!క‌థ‌!!
కాకినాడలో పుట్టి పెరిగిన యువకుడు సంజూ !! రామ్‌!!. అతడ్ని తల్లిదండ్రులు!! సితార, జయప్రకాష్‌!!లు చాలా గారాబంగా పెంచుతారు. చదువు పూర్తయ్యాక తల్లిదండ్రులను నొప్పించలేక ఉద్యోగం కోసం హైదరాబాద్‌ బయలుదేరతాడు. రైలులో అనుపమ !!అనుపమ పరమేశ్వరన్ ను!! చూసి ఇష్టపడతాడు. ఆ ప్రయాణంలో ఆమెను కూడా సరదాగా ఆటపట్టిస్తాడు. తన తల్లికి స్నేహితుడైన విశ్వనాథ్ !!ప్రకాష్‌రాజ్‌!! ఇంట్లో అతిథిగా దిగుతాడు. విశ్వనాథ్‌ ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి. అనుపమ.. విశ్వనాథ్‌ కుమార్తె అని తెలుసుకున్న సంజూ ఆశ్చర్యానికి గురవుతాడు. మరోపక్క తన ట్రైనింగ్‌ సెంటర్‌లో రీతూ !!ప్రణీత!!ను చూసి లవ్‌లో పడతాడు. చిలిపి పనులతో ఆమెను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో అనుకోని సంఘటన వల్ల అనుపమ త‌న‌ను ప్రేమిస్తున్నట్లు తెలుసుకుంటాడు. అయితే, అప్పటికే కార్తీక్ !!నోయల్‌!! తో అనుపమ నిశ్చితార్థం అయిపోతుంది. మరి చివరికి సంజూ తన ప్రేమను దక్కించుకున్నాడు? విశ్వనాథ్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా అనేది వెండితెర‌పై చూడాల్సిందే.

!!విశ్లేష‌ణ‌!!
క‌థ పాత‌ది అనిపించినా కాన్సెప్ట్ కొత్త‌గా తెర‌కెక్కించాలి. ఇది ద‌ర్శ‌కుల క‌లానికి చూపించే విధానానికి తార్క‌ణం. అయితే ఇక్క‌డ న‌క్కిన త్రినాధరావు సినిమాకు ప్రాణం పెట్టారు అనే చెప్పాలి.హలో గురు ప్రేమ కోసమే సినిమాలో ఎంట‌ర్ టైన్ మెంట్ కి ఎక్కువ శాతం మార్కులు వేసి, బ‌ల‌మైన క‌థ‌ని ప్రొజెక్ట్ చేశారు. ఈ సినిమాలో వ‌య‌లెన్స్ నెగిటీవ్ షేడ్స్ అనేది క‌నిపించ‌లేదు.. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవ‌డం అలాగే నిశ్చితార్దం అయిన త‌ర్వాత ఆ పెళ్లిని వ‌దిలి అబ్బాయితో ఇష్ట‌ప‌డ‌టం. ప్రేమించిన వాడి కోసం త్యాగాలు చేయ‌డం, చాలా సినిమాల్లో ఉన్నాయి. ఇదీ అదే, కాని చూపించిన విధానం అద్బుతంగా రెండున్న‌ర గంట‌లు ఆక‌ట్టుకుంది. నటుడు సురేష్‌-రామ్‌ల మధ్య నడిచిన ఎపిసోడ్‌లు ఆద్యంతం నవ్విస్తాయి. ప్రథమార్ధంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ పండటానికి ఇవే ప్రధాన కారణంగా నిలిచాయి.

రామ్ లుక్స్ పై మ‌రింత శ్ర‌ద్ద పెట్టాడు. ఇది సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక మ‌రితం హ్యాండ్స‌మ్ గా క‌నిపించాడు.. రామ్‌-ప్రకాష్‌రాజ్‌ల ఫ్రెండ్‌షిప్. ఒక తండ్రి అమ్మాయి తండ్రిగా ఉంటూ, తన కూతురు ప్రేమించే అబ్బాయితో ఫ్రెండ్‌షిప్‌ చేయడం అందరికీ నచ్చుతుంది. ఈ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కాస్త కొత్త‌గా అనిపించింది నిజంగా అనిపిస్తుంది కూడా, అందుకే క‌నెక్ట్ అవుతారు.ఈ మధ్య లవర్‌బాయ్‌ పాత్రల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు రామ్‌. మరోసారి అలాంటి పాత్రనే ఎంచుకున్నాడు. మ‌రి ఎలా చేస్తాడు అని అనుకున్నారు కాని సినిమాకు ప్రాణం పెట్టాడు అనే చెప్పాలి. ఈ పాత్ర‌లో రామ్ న‌ట‌న అద్బుతం. ప్ర‌ణీత అనుప‌మ ఇద్ద‌రూ కూడా తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.. అనుప‌మ పాత్ర సినిమాలో కీల‌కం అయింది. దేవి సంగీతం అదుర్స్ అనే అనాలి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ద‌ర్శ‌క‌త్వం బాగుంది. దానికి తోడు దిల్ రాజు నిర్మాణ విలువ‌లు భ‌ళా అనిపించాయి. క‌థ‌కు త‌గ్గ‌ట్లు పాత్ర‌లు బాగా చేశారు అనే చెప్పాలి.

!!బలాలు!!
రామ్‌న‌ట‌న
క‌థ‌ని కొత్త‌గా చూపించ‌డం
కామెడీ
రామ్‌-ప్రకాష్‌రాజ్ ఎపిసోడ్‌లు

!!బలహీనతలు!!
రొటీన్‌ కథ
పతాక సన్నివేశాలు

!!బాట‌మ్ లైన్ !! హలో గురు ప్రేమ కోసమే మ‌రో హిట్ కోస‌మే

!!రేటింగ్!! 2.5

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.