Cinetollywood

చిక్కుల్లో త్రివిక్రమ్ ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో

GST-officers-check-Trivikram-Srinivas-accounts

అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ తో ఉన్న త్రివిక్రమ్ అదే జోష్ తో వెంటనే ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశారు… దీంతో మరో భారీ చిత్రానికి ఆయన అడుగులు వేశారు అనే చెప్పాలి, ఇక ఈ కథ పై ఫోకస్ పెట్టారు త్రివిక్రమ్.. ఇక ఎన్టీఆర్ సినిమా కెరియర్ లో ఇది 30 వ చిత్రం.

సినిమాల్లో విజయాలు వస్తున్నా కొన్ని వివాదాలు మాత్రం త్రివిక్రమ్ ని విడిచిపెట్టడం లేదు. అఆ సినిమా నుంచి కాపీ మరకలు ఆయనపై ఎక్కువవుతున్నాయి… గతంలో తీసిన అతడు, జులాయి, అత్తారింటికి దారేది సినిమాల్లోనూ కాపీ వివాదం నడిచినప్పటికీ.. అవి కొన్ని సీన్లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే.. ఇక తాజాగా బన్నీ అల వైకుంఠపురం సినిమాలో కూడా ఈ కథ తనదే అంటూ ఓ రచయిత రచ్చ చేశారు.

ఇక త్రివిక్రమ్ పై మరో కొత్త వివాదం నడుస్తోందట..మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలు తీసే సమయంలో స్టార్టింగ్ లో త్రివిక్రమ్ కు కొంత అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేయాలని కోరారు, అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట, కాని కుదరక ఆయన వారితో సినిమా చేయలేకపోయారు, ఎక్కువగా హరిక అండ్ హసిని బ్యానర్ తో సినిమాలు చేశారు.

అయితే తాము ఇచ్చిన అడ్వాన్స్ను వెనక్కి ఇచ్చేయాలని మైత్రీ సంస్థ ఎప్పటినుంచో త్రివిక్రమ్ను అడుగుతుందోట. దీంతో ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు మధ్యవర్తిత్వం తీసుకున్న హారిక సంస్థ మైత్రీ వారు ఇచ్చిన అడ్వాన్స్ కంటే రెట్టింపు ఇస్తామని అన్నారట. కాని దీనిపై వారు మూడు రెట్లు అడుగుతున్నారు అని అంటున్నారు, సో నిర్మాణ సంస్దలు కూడా రెండు మూడు ఐదురూపాయల వడ్డీలకు నగదు తెచ్చి సినిమాలు తీస్తారు.. అయితే చిత్రం ఫెయిల్ అయితే అసలు పోతుంది వడ్డీ పోతుంది, అందుకే అడ్వాన్సుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ..సినిమాకి ముందు మాత్రమే అడ్వాన్సులు ఇవ్వాలి అని చాలా మంది డిసైడ్ అవుతున్నారు, మరి చూడాలి త్రివిక్రమ్ సమస్య ఎప్పుడు తీరుతుందో.

Gallery

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.