
హుషారెత్తే అప్డేట్ ప్రభాస్ 25పై కీలక ప్రకటన
ఎల్లలు దాటిన అభిమానులకు కిక్కిచ్చేలా వరుసపెట్టి బిగ్గెస్ట్ సినిమాలకు కమిటవుతున్నారు ప్రభాస్. ఈ నేపథ్యంలో ఆయన 25వ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన బయటకు రావడం రెబల్ స్టార్ అభిమానులను హుషారెత్తిస్తోంది.
‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఎల్లలు దాటిన అభిమానులకు కిక్కిచ్చేలా వరుసపెట్టి బిగ్గెస్ట్ సినిమాలకు కమిటవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన 25వ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన బయటకు రావడం రెబల్ స్టార్ అభిమానులను హుషారెత్తిస్తోంది.
ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 20వ సినిమా ‘రాధే శ్యామ్’ షూటింగ్ పూర్తి చేసిన డార్లింగ్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ 21వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 22వ మూవీ ‘సలార్’ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు ప్రభాస్. ఇది గాక 23వ సినిమాగా ప్రాజెక్ట్ K చేస్తున్నారు. ఇక 24వ సినిమా సిద్ధార్ధ్ ఆనంద్‌తో ఉండనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన 25 సినిమా గురించిన ప్రకటన రావడం ప్రభాస్ అభిమానుల్లో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. రెబల్ స్టార్ స్పీడ్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్.
ప్రభాస్ 25వ సినిమాను అక్టోబర్ 7న అధికారికంగా ప్రకటించనున్నట్లు ఓ స్టేట్మెంట్ వచ్చింది. ఈ చిత్ర డైరెక్టర్, నిర్మాణ సంస్థ, నటీనటులకు సంబంధించిన అన్ని వివరాలు అదే రోజు తెలుపనున్నారట. రెబల్ స్టార్ అభిమానుల్లో క్యూరియాసిటీని మరింత పెంచుతూ అప్పటిదాకా ఆ వివరాలు గోప్యంగా ఉంచాలని డిసైడ్ అయ్యారట. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ కేటాయించి ఇండియా తెరపై మునుపెన్నడూ చూడని విజువల్ వండర్‌గా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్నారనే టాక్ నడుస్తోంది. సో.. అసలు విషయం తెలియాలంటే అక్టోబర్ 7 వరకు వేచి చూడాల్సిందే మరి!.
Gallery
Latest Updates
-
దేశ భక్తిని చాటుకునే ఏ అవకాశాన్ని వదుకోవద్దు – సినీ నటులు ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్
-
హై ఫైవ్ మూవీ రివ్యూ
-
“సాఫ్ట్ వేర్ బ్లూస్” సినిమా రివ్యూ
-
హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ఎనిగ్మా ది ఎక్సపీరియన్స్ సెంటర్ ప్రారంబమైంది.
-
Sonu Sood tweets about something big, fans in a tizzy
-
మెగాస్టార్ చీరంజీవి “రుద్రవీణ” టైటిల్ తో రోబోతున్న కొత్త చిత్రం
-
హైదరాబాద్ నడి బొడ్డున ఎడ్యుకేషన్ ఫెయిర్
-
Grand Launch of Thousand Moons by Sree Vishnu and Nara Rohit
-
ప్రియురాలు ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడి స్టోరీ “విక్రమ్ సినిమా”
-
‘అఖండ’లో జై బాలయ్య సాంగ్‌కి రవితేజ స్టెప్పులు.. వీడియో వైరల్: Ravi Teja