గీత గోవిందం మూవీ రివ్యూ

Geetha Govindam movie review and rating

టైటిల్ : గీత గోవిందం
జానర్ : రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : పరశురామ్‌
నిర్మాత : బన్నీ వాస్‌

!!ఇంట్రో !!

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రంపై యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది… ట్రైలర్ ఆకట్టుకోవడం, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో యూత్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రీమియర్ షోల‌లో ఇప్ప‌టికే మంచి టాక్ వ‌చ్చింది… ఈసినిమాకి సంగీతం గోపి సుందర్ అందించారు.. విజయ్ దేవేరుకోండ , రష్మిక మందాన, నాగేంద్ర బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు..అర్జున్‌ రెడ్డి సినిమాతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిన విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో ఎలా అల‌రించారో ఓ సారి చూసొద్దాం.

!!కథ !!
విజయ్‌ గోవింద్ !!విజయ్‌ దేవరకొండ!! లెక్చరర్‌. చిన్నప్పటి నుంచి చాంగటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు విని పెరిగిన పద్ధతి గల కుర్రాడు. తను చేసుకోబోయే అమ్మాయి కూడా సాంప్రదాయబద్ధంగా, తన అమ్మలాగే ఉండాలని కలలు కంటుంటాడు. అలా ఓ అమ్మాయి వెంటే 6 నెలలు తిరిగిన తరువాత ఆ అమ్మాయికి పెళ్లయిందని తెలిసి నిరుత్సాహపడతాడు. కొద్ది రోజులకు గీత !! రష్మిక మందన్న!!ను గుడిలో చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.ఎలాగైన ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో తన చెల్లికి పెళ్లి కుదరటంతో కాకినాడ బయలుదేరుతాడు విజయ్‌… గీత కూడా అదే బస్సులో విజయ్‌ పక్కన సీటులోనే కూర్చుంటుంది. ఎలాగైనా ప్రేమ విషయం చెప్పాలనుకున్న విజయ్‌, ఫ్రెండ్స్‌ చెప్పిన చెత్త సలహాల కారణంగా ఆమె దృష్టిలో ఓ రోగ్‌ అనిపించుకుంటాడు. అలా గీతకు దూరమైన విజయ్‌ తిరిగి ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు..? ఈ మధ్యలో గీత, గోవింద్‌ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? అన్నదే మిగతా కథ. ఇది వెండిత‌రెర‌పై చూడాల్సిందే.

!!విశ్లేష‌ణ‌!!
విజ‌య్ దేవ‌రకొండ సినిమా అంటే ప్రేక్ష‌కుల్లో ముఖ్యంగా మాస్ లో ఓ ఇంప్ర‌ష‌న్ వ‌చ్చింది… అత‌ని నుంచి అటువంటి సినిమా వ‌స్తుంది అని
అనుకున్నారు.. కాని ఒక్క‌సారిగా క్లాస్ లుక్ కి వ‌చ్చాడు విజ‌య్.. దీంతో ఈ చిత్రంతో ఇటు క్లాస్ ప్రేక్ష‌కుల‌ను కూడా ద‌గ్గ‌ర చేసుకున్నాడు అనే చెప్పాలి. ఈ సినిమాలో పూర్తి కాంట్రాస్ట్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు. భయస్తుడిలా హీరోయిన్‌ చుట్టూ మేడమ్‌..మేడమ్‌ అంటూ తిరిగి పాత్రలో విజయ్ నటన సూపర్బ్‌… త‌నకు యాప్ట్ గా సూట్ అయ్యే డైలాగ్ డెలివ‌రీతో ఈ సినిమాలో కూడా అద‌రొగొట్టాడు.. ఇక ఎమోష‌న్ సీన్స్ పండించాడు.. త‌న‌లో ఇటువంటి ఎమోష‌న్ సీన్స్ పండించే విజ‌య్ ఉన్నాడు అని ఈ సినిమాతో తెలియ‌చేస్తాడు.

కోపం ప్రేమ రెండూ ఉండే హీరోయిన్ గా అద‌ర‌గొట్టింది ర‌ష్మిక …హీరోయిన్‌ గా రష్మిక మరోసారి వావ్‌ అనిపించారు అనే చెప్పాలి.. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ గీత పాత్రలో మరింత చేరువయ్యారు. ఈ చిత్రంలో న‌ట‌న‌లో ఇద్దరూ పోటీ ప‌డి న‌టించారు అనే చెప్పాలి. ఇక ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు… కామెడి కుటుంబం చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాడు…ఈ క‌థ పాత‌దే అయినా త‌న డైలాగుల‌తో అల‌రించాడు స్క్రీన్ ప్లే అద్బుతంగా ఉంది అని చెప్పాలి.. విజ‌య్ ఎక్స్ ప్రెష‌న్స్ ని ఇప్పించ‌డంతో ప‌రుశురామ్ క‌ష్ట‌ప‌డ్డాడు అనేది తెలుస్తుంది వెండి తెర‌పై… సినిమాల్లో అతుకులుగా కామెడిని ఇరికించకుండా అర్ద‌వంతంగా లీడ్ చేస్తూ వ‌చ్చాడు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్… ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే సాంగ్ వీడియోగా సినిమాలో ఫ్రేమ్స్ చూస్తే అన్నింటా హైలెట్ గా నిలిచింది. ఇక మ‌రో హిట్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెస్ ట్రాక్ లోకి వెళ్లాడు అనే చెప్పాలి.. సినిమా చూసిన ప్రేక్ష‌కులు హిట్ అనే టాక్ వినిపిస్తున్నారు.

!!ప్లస్‌ పాయింట్స్‌!!
విజయ్‌ దేవరకొండ, రష్మిక నటన కెమెస్ట్రీ
సంగీతం
డైలాగ్స్‌
ద‌ర్శ‌క‌త్వం

!!మైనస్‌ పాయింట్స్ !!
పాత కథ
సెకండాఫ్ పై కాస్త శ్ర‌ద్ద, అక్క‌డ‌క్క‌డా నెమ్మ‌దించిన భావ‌న

రేటింగ్ 3.25

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.