Cinetollywood

మూవీ రివ్యూ : ‘గరుడ వేగ’

న‌టీన‌టులు: రాజ‌శేఖ‌ర్.. పూజా కుమార్.. కిషోర్.. నాజ‌ర్‌.. పోసాని కృష్ణ‌ముర‌ళి.. అదిత్ అరుణ్.. అలీ.. పృథ్వీ.. షాయాజీ షిండే.. అవ‌స‌రాల శ్రీనివాస్‌.. శ‌త్రు.. సంజ‌య్ స్వ‌రూప్‌.. ర‌వివ‌ర్మ‌.. ఆద‌ర్శ్‌.. చ‌ర‌ణ్ దీప్‌.. ర‌వి రాజ్ త‌దిత‌రులు.

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

నేప‌థ్య సంగీతం: శ్రీచ‌ర‌ణ్ పాకాల‌

కూర్పు: ధ‌ర్మేంద్ర కాక‌రాల‌

ర‌చ‌న‌: ప‌్ర‌వీణ్ స‌త్తారు, నిరంజ‌న్ రామిరెడ్డి

క‌ళ‌: శ్రీకాంత్ రామిశెట్టి

ఛాయాగ్ర‌హ‌ణం: అంజి, సురేష్ ర‌గుతు, శ్యామ్ ప్ర‌సాద్‌, గికా, బాకుర్

నిర్మాత‌: ఎం.కోటేశ్వ‌ర్ రాజు

క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌వీణ్ స‌త్తారు.

సంస్థ‌: శివాని శివాత్మిక ఫిలింస్‌, జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్‌.

గ‌తంలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోయేవారు హీరో రాజ‌శేఖ‌ర్, త‌ర్వాత వ‌రుస‌గా ఆయ‌న‌కు ప‌రాజయాలు రావ‌డంతో స‌త‌మ‌త‌మ‌య్యారు.. ఇక తాజాగా ఆయ‌న ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారుతో సినిమా తీసి త‌న‌కు పున‌ర్వైభ‌వం వ‌స్తుంది అని ఆశించారు.. అందుకే వారిద్ద‌రూ క‌లిసి పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ 126.18 ఎమ్ అనే చిత్రం చేశారు.. ఈ సినిమా క‌థ చెప్పిన వెంట‌నే న‌చ్చి చేశాను అని ప్ర‌మోష‌న్స్ లోచెప్పిన రాజ‌శేఖ‌ర్, ప్ర‌వీణ్ స‌త్తార్ తెర‌కెక్కించిన గ‌రుడ వేగ‌లో ఎలా న‌టించారు, ప్రేక్ష‌కుల‌ను ఎలా అల‌రించారు అనేది వేగంగా తెలుసుకుందాం..
!! కథ‌!! నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ !! ఎన్‌ఐఏ!! లో అసిస్టెంట్‌ కమిషనర్‌ అధికారి చంద్రశేఖర్ !!రాజశేఖర్‌!! తనకు అప్పగించిన పనులన్నింటినీ తన బృందంతో కలిసి సమర్థంగా పూర్తి చేస్తుంటాడు చంద్ర‌శేఖ‌ర్ . ఈ క్రమంలో భార్య స్వాతి !! పూజాకుమార్ !!తో తరచూ గొడవలు వస్తుంటాయి. కుటుంబం గురించి పట్టించుకోవడం లేదని, ఆవేదన వ్యక్తం చేస్తూ విడాకులకు సిద్ధపడుతుంది అత‌ని భార్య . దాంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు చెప్పి, ఇంటికి బయలుదేరతాడు చంద్రశేఖర్‌. ఇంతలోనే నిరంజన్ !!అదిత్‌ అరుణ్‌!! అనే ఓ టెకీని అంతం చేయాలనుకున్న ఇద్దరు షూటర్లు తారసపడతారు. ఇంతకీ ఆ షూటర్లు ఎవరు? నిరంజన్‌ను ఎందుకు చంపాలనుకున్నారు? ఆ కేసును ఛేదించే క్రమంలో చంద్రశేఖర్‌కు ఎలాంటి విషయాలు తెలిశాయి.. తదితర అంశాలను వెండితెర‌పై చూడాలి.
!! న‌ట‌న !! ఎన్‌ఐఏ నేపథ్యానికి తగ్గట్టుగానే ఈ కథంతా వివిధ కేసుల పరిశోధనలతో సాగింది. ప‌లు నేరాలను పసిగట్టడం, వాటి కోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌లు నిర్వహించడం నేరస్థులను మట్టుపెట్టడం వంటి సన్నివేశాలతో సినిమా తీర్చిదిద్దారు ప్ర‌వీణ్ . ఆరంభంలో జార్జియాలోని బైక్‌ ఛేజింగ్‌, డ్యామ్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తాయి. సినిమా క‌థ అంతా నీరంజ‌న్ చుట్టూ న‌డుస్తుంది.ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్‌రెడ్డి !! పోసాని కృష్ణమురళి!! ని మట్టుపెట్టడం కోసం పెట్టిన బాంబును నిర్వీర్యం చేయడం అక్కడే నిరంజన్‌ని పట్టుకోవడం వంటి సన్నివేశాలు ఉత్కంఠను కలిగిస్తాయి. విరామానికి ముందు వచ్చే ఆ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. రాజ‌శేఖ‌ర్ న‌ట‌న అద్బుతంగా ఉంది అనే చెప్ప‌వ‌చ్చు..ఈ సినిమాకి ముఖ్యంగా బ‌లమైన క్యారక్ట‌ర్ ఎన్ ఐఏ అధికారి, ఈ చిత్రంలో ఎన్‌ఐఏ అధికారిగా పరిణతితో కూడిన నటన కనబరిచారు. పాత్రకు తగ్గట్టుగానే సహజంగా నటించారు. గృహిణి పాత్రలో పూజా కుమార్‌ కనిపిస్తుంది. అయితే ఆమె హావభావాలు, సంభాషణలు కాస్త డిఫ‌రెంట్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి, ద్వీతియార్ధంలో సినిమా పై ఫోక‌స్ చేసి ఉంటే మ‌రింత ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేది.

!! బలాలు !!

రాజశేఖర్‌ నటన

కథ

ఆకట్టుకునే విరామ సన్నివేశాలు

సంగీతం, ఛాయాగ్రహణం
!! బలహీనతలు !!

ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు
రాజ‌శేఖ‌ర్ గ‌రుడ వేగ‌తో మ‌ళ్లీ త‌న సినిమాల‌కు హిట్ టాక్ తెచ్చుకున్నారు అన‌డంలో అతిశ‌యోక్తి లేదు, ప్రేక్ష‌కులంద‌రిని రాజ‌శేఖ‌ర్ యాక్ష‌న్ ఈ చిత్రంలో ఆక‌ట్టుకుంటుంది.

Cinetollywood.com రేటింగ్ -2.75/5

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.