గాజువాకలో గ్లాసు ఫ్యాన్ సైకిల్ ఎలా ఉన్నాయి

Gajuwaka Assembly Constituency Politics 2019

ఒక పార్టీ సీఎం అభ్యర్ది నిలబడుతున్నాడు అంటే ఆ సెగ్మెంట్ పై ఆశలు అలాగే పెట్టుకుంటారు.. మరి ఇప్పుడు కూడా ఇలాంటి చర్చే గాజువాకపై జరుగుతోంది. అనేక ఈక్వేషన్లు చూసుకున్న పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయాలని చూసుకున్నారు. గతంలో ప్రజారాజ్యం కూడా గెలిచిన సెగ్మెంట్ కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం, ఇలా పలు ధఫాల సర్వేలు పాజిటీవ్ పవనాలు పవన్ పై ప్రసారం అయ్యాయి.. ఇక్కడ కార్మికులు కర్షకులు ఎక్కువ మంది ఉంటారు .ఇది కూడా జనసేనాని నిర్ణయానికి కారణం అవ్వచ్చు. ఇక్కడ వైసీపీ ముందు నుంచి బలంగానే ఉంది. అదిపవన్ కు తెలుసు, కాని తన ఎంట్రీతో కచ్చితంగా రీడింగ్ మారుతుంది రేంజ్ వైసీపీకి తగ్గుతుంది అని భావించారు పవన్ , కట్ చేస్తే రాజకీయంగా వైసీపీ గ్రాఫ్ అలాగే ఉంది. జనసేనకు వచ్చే మద్దతు మొత్తం టీడీపీ బీజేపీ ఓటు బ్యాంకు మాత్రమే అని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ ఇక్కడ అష్టకష్టాలు పడుతూ మాజీ నేతలకు వల వేసి పార్టీలో చేర్చుకుంటోంది. వేల ఓట్లు కాకున్నా వందల ఓట్లు అయినా వారివల్ల పడతాయి అని వారి ఆలోచన.మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డిని వైసీపీ నుంచి టీడీపీలోకి తీసుకున్నారు సైకిల్ పార్టీనేతలు, ఇక వైసీపీ కూడా ఏమీ తక్కువ కాదు అని ముందుకు వచ్చింది. వెంటనే అక్కడ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు అనుకూలంగా ఉన్న ఓకీలక నేతని అనుచరుడుగా భావించే నేత అయిన దొడ్డిరమణని పార్టీలో చేర్చుకున్నారు ..ఇక్కడతో వైసీపీ టీడీపీ నేతల పార్టీలో చేరికలతో పార్టీలో హీట్ పుట్టించడం కనిపించింది. కాంగ్రెస్ లో ఉన్న ఇంటాక్ నేత, బలమైన నాయకుడు మంత్రి రాజశేఖర్ కు రెండు పార్టీలు ఆఫర్ ఇచ్చినా ఆయన వైసీపీలో చేరిపోయారు. వీరి అందరూ సపోర్ట్ ఎలా ఉన్నా మంత్రి రాజశేఖర్ వైసీపీలో చేరడంతో పార్టీకి నూతన జొష్ అయితే వచ్చింది కార్మికుల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది.

అయితే గాజువాకలో వీరికి అందరికి ఎలాంటి సపోర్ట్ ఉన్నా కాపులు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది ఇక్కడ ముఖ్యంగా ఆలోచించే అంశం. టీడీపీకి పెద్ద ఎత్తున సపోర్ట్ ఉందా వైసీపీకి పెద్ద ఎత్తున జనం సపోర్ట్ ఉందా అంటే, మొత్తం వైసీపీకి జనం సపోర్ట్ ఉంది. అయితే ఇప్పుడు మాత్రం ఇక్కడ పవన్ ఎంట్రీతో కాస్త పొలిటికల్ ఫైట్ అయితే కనిపిస్తోంది, తెలుగుదేశం ఈరేసులో లేదు అని కేవలం వైసీపీ జనసేన మాత్రమే గాజువాకలో ఎన్నికల రేసులో ఉన్నాయి అంటున్నారు ఇక్కడ రెండు పార్టీల నాయకులు.

వీరిలో గాజువాకలో మీ అభిప్రాయం ప్రకారం ఎవరు గెలుస్తారు అని భావిస్తున్నారు కామెంట్లో చెప్పండి
పల్లా శ్రీనివాసరావు టీడీపీ
టి.నాగిరెడ్డి వైసీపీ
పవన్ కల్యాణ్ జనసేన

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.