జనసేనలోకి ఈ సెగ్మెంట్లో నలుగురు చూపు

తీర ప్రాంతంలో సముద్రపు హోరు వినిపిస్తోంది.. జనసేన పేరు వినిపిస్తోంది. అదే నరసాపురం గత ఏడాది ఇక్కడ నుంచి పోటీకి జనసేనకు ఒక్కరు కూడా ఉండరు అని అనుకుంటే , ఇప్పుడు ఏకంగా ముగ్గురు నాయకులు ఇక్కడ నుంచి పోటికి రంగంలో ఉన్నారు.. వైసీపీ నుంచి ముదునూరి ప్రసాదరాజుకి జగన్ టికెట్ ఫిక్స్ చేశారు, బాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకి లేదా, కొత్తపల్లి కుటుంబంలో ఒకరికి టికెట్ ఇచ్చేలా ఉన్నారు.. సుబ్బారాయుడు లేదా జానకిరామ్ వీరిలో ఒకరు అయితే టికెట్ సాధించుకోవచ్చు అని తెలుస్తోంది. లేకపోతో మరోసారి బండారుకి అవకాశం ఇవ్వచ్చు , ఇక జనసేన నుంచి ఇక్కడ ముగ్గురు పార్టీ టికెట్ ఆశిస్తున్నారట.

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్న సీనియర్ నాయకుడు చినమిల్లి సత్యనారాయణ. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు ఐదేళ్లు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగారు. కాని ఆయనకు పార్టీ గుర్తింపు ఇవ్వడం లేదు.. ఈ సమయంలో ఆయన తనయుడు పార్టీకి షాక్ ఇచ్చి జనసేనలో చేరారు ..ఆయన కూడా వృత్తిరిత్యా డాక్టర్ ఆయన పేరు అప్పాజి… దీంతో ఆయనకూడా జనసేన నుంచి ఎంపీ టికెట్ సంపాదించడం పెద్ద కష్టం కాదు అని అంటున్నారు. ఇక ఆయన కూడా వస్తే జనసేన నుంచి నరసాపురం ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరో వ్యక్తి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కొత్తపల్లి సురేష్ కూడా జనసేనలో చేరే వార్తలు వస్తున్నాయి.

అమెరికాలో స్థిరపడిన కొవ్వలి నాయుడు పార్టీ కూడా టీడీపీ నుంచి జనసేనలో చేరే అవకాశం ఉంది అని తెలుస్తోంది..
గత మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున చైర్పర్సన్గా నిలబడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో నాయుడు తన సోదరి రత్నమాలను బరిలోకి దించారు. ఇక వారికి కూడా రాజకీయంగా ఇక్కడ ఫేమ్ ఉండటం, కాపు సామాజకి వర్గం కావడంతో వారికి కూడా జనసేనలో చేరాలి అని ఉంది అని తెలుస్తోంది. ఇక ఈసారి ఆయనే నేరుగా పోటికి దిగుతారు అని తెలుస్తోంది.

తీర ప్రాంత అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ కూడా ఈసారి పోటికి చూస్తున్నారు. ఆయన కూడా జనసేనలో చేరే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తోంది.. మొత్తం వీరు అందరూ కూడా టీడీపీ నుంచి పార్టీ మార్పుకై చూడటం, ఇక్కడ జనసేన ఎంత బలంగా ఉందో తెలుస్తోంది.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.