ప్రకాశంలో జనసేన ఆరు సీట్లు ఫిక్స్

Fixed the six seats Janasena in Prakasham District

జనసేన అధినేత ఎన్నికల పై ఫోకస్ చేశారు… ఇక 100 రోజులు మాత్రమే ఏపీలో ఎన్నికలకు సమయం ఉంది.. ఇక వైసీపీ తెలుగుదేశం పవన్ తో పొత్తు పెట్టుకుంటాం అని సంప్రదింపుల కోసం ప్రయత్నిస్తున్నా, పవన్ మాత్రం ఎవరితో పొత్తులు లేవు అని చెబుతున్నారు, ఇక ఇటీవల గుంటూరులో ఎక్కడ ఎవరు పోటికి నిలుస్తారు అనే విషయంలో పవన్ చర్చలు జరిపి మూడు సీట్లపై క్లారిటీ ఇచ్చారు, అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లాపై కూడా పవన్ లెఫ్ట్ పార్టీలతో చర్చించారు అని తెలుస్తోంది.. ప్రకాశం జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనుంది అని తెలుస్తోంది.. మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్లు జిల్లాలో ఉన్నాయి.. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ ఆరు సీట్లు గెలుచుకుంది.. ఇక తెలుగుదేశం ఐదు సీట్లు గెలిచింది, ఇక చీరాల నుంచి ఆమంచి నవోదయ పార్టీ తరపున గెలిచారు, తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు, ఇక వైసీపీకి ఫిరాయింపుల ఎఫెక్ట్ జిల్లాలో పడింది.

ప్రకాశం జిల్లాలో జనసేన ఆరు నియోజకవర్గాల్లో, వామపక్షాలు మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోను పోటీ చేయాలని స్ధూలంగా నిర్ణయించారట. జనసేన
గిద్దలూరు, – చంద్రశేఖర్ యాదవ్
ఒంగోలు,
దర్శి,
పర్చూరి,
కనిగిరి,
మార్కాపురం ఈ ఆరు సెగ్మెంట్ల నుంచి జనసేన పోటీ చేయాలి అని చూస్తోంది… ఇక్కడ ఐదు సెగ్మెంట్లలో (ఒకటి ఫిక్స్ ) ఎవరిని బరిలోకి దించాలి అని జనసేన టీం ఆలోచన చేస్తోంది.. ఇక నేతలు పవన్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు, ఇక మరో ఆరుసీట్లలో వామపక్షాలు పోటీ చేయనున్నాయి.. ఇలా ఏకంగా పవన్ లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకుంటుంటే, మళ్లీ పవన్ ని చంద్రబాబు ఇంకా కలిసి వస్తారా అని ఎదురుచూస్తున్నారు… సో చూడాలి రాజకీయంగా ఎలాంటి పరిస్దితి ఉంటుందో.

Recent News

Latest News

Cine Tollywood provides latest movie news, ploitical news, cinema entertainment news, latest tollywood trailers, videos, gossips and gallery in the state of Telangana, Andhra Pradesh and near by regions. Get all the latest movie updates and reviews on your favourite telugu movies. Also find more information on box office collections.